Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సచిన్ కోసం కామెంటేటర్‌గా మారిన మిస్టర్ పర్‌ఫెక్ట్!



ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వీరాభిమానుల్లో ఒకరైన బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సచిన ఆడుతున్న 200వ టెస్టు, చివరి టెస్టు మ్యాచ్ చూసేందుకు ఈ రోజు ముంబైలోని వాంఖడే స్టేడియంకు చేరుకున్నారు. కేవలం మ్యాచ్ చూడటం మాత్రమే కాదు....కామెంట్రీ బాక్సులో కూర్చుని కామెంటేటర్‌గా మారాడు అమీర్ ఖాన్.

మైక్ అందుకున్న అమీర్ ఖాన్...ఇండియన్ క్రికెట్‌గాడ్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. త్వరలో ‘ధూమ్-3' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అమీర్ ఖాన్....ఇటీవల విడుదలైన తన సినిమా సాంగ్ ‘ధూమ్ మచాలే'ను సచిన్‌కు అంకితం చేసిన సంగతి తెలిసిందే. అమీర్ లాంటి స్టార్ కామెంటేటర్‌గా మారడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.



అమీర్ ఖాన్



చాలా ఏళ్ల నుంచి అమీర్ ఖాన్, సచిన్ టెండూల్కర్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. సచిన్ గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ...సచిన్ కేవలం గొప్ప ఆటగాడు మాత్రమే కాదు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన తన ఆటతో దేశ కీర్తి ప్రతిష్టలు పెంచాడు. కోట్లాది మంది భారతీయులకు ఆదర్శంగా నిలిచాడు' వ్యాఖ్యానించారు.

‘సచిన్ లాంటి స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ అంటే క్రికెట్ అభిమానులకు వెలితిగా ఉండటం సహజమే. కానీ సచిన్ చివరి మ్యాచ్‌ను అభిమానులంతా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు' అని అమీర్ ఖాన్‌ను అన్నారు. సచిన్ లాస్ట్ ఇన్నింగ్స్ బెస్ట్‌గా ఉండాలని ఆకాక్షించాడు. సచిన్‌కు తాను అభిమానిని అని ఎంతో గొప్పగా చెప్పుకుంటూ మురిసిపోయాడు ఈ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్!

Recent Posts