Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బౌండరీలు దంచిన సచిన్: మరో రికార్డు

ముంబై: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో తన సొంత మైదానం వాంఖడేలో సచిన్ టెండూల్కర్ చెలరేగిపోతున్నాడు. అతను బౌండరీలు కొడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇదే సమయంలో అతను మరో రికార్డు సాధించాడు. టెస్టుల్లో అత్యధిక బౌండరీలు కొట్టిన ఘనతను కూడా సాధించాడు. టెస్టు మ్యాచుల్లో సచిన్ టెండూల్కర్ 2,048 ఫోర్లు బాదాడు. 

భారత స్నిన్నర్ అశ్విన్ టెస్టుల్లో వంద వికెట్లు సాధించిన ఘనతను సాధించాడు. భారత్, వెస్టిండీస్ రెండో టెస్టు మ్యాచ్ స్కోర్ కార్డు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు నష్టపోయి 157 పరుగులు చేసింది. సచిన్ టెండూల్కర్ 38 పరుగులతో, ఛతేశ్వర్ పుజారా 34 పరుగులతో క్రీజులో ఉన్నారు కాగా, వెస్టిండీస్ 182 పరుగులకు అవుటైన తర్వాత భారత్ తన తొలి ఇన్నింగ్సును ప్రారంభించింది. ఆచితూచి ఆడుతూ వచ్చిన భారత ఓపెన్ శిఖర్ ధావన్ 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షిల్లింగ్‌ఫోర్డు బౌలింగులో అవుటయ్యాడు. దీంతో భారత్ 77 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ అవుటైన కొద్దిసేపటికే మురళీ విజయ్ షిల్లింగ్‌ఫోర్డు బౌలింగులోనే 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో భారత్ అదే స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. దాంతో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌కు దిగాడు. అదే అతనికి చివరి టెస్టు మ్యాచు. భారత స్పిన్ ధాటికి వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ కుదేలయ్యారు. గురువారం తొలి రోజు తొలి ఇన్నింగ్సులో వెస్టిండీస్ 182 పరుగులకే చేతులెత్తేసింది. భారత బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా ఐదు వికెట్లతో మరోసారి మెరిశాడు. అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కగా, భువనేశ్వర్ కుమార్, షమీ చెరో వికెట్ తీసుకున్నారు.


 భారత్‌తో గురువారం నుంచి జరుగుతున్న మ్యాచులో వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ తొలి ఇన్నింగ్సులో మరోసారి విఫలమయ్యాడు. అతను కేవలం 11 పరుగులు చేసి మొహమ్మద్ షమీ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో వెస్టిండీస్ 25 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వెస్టిండీస్ 86 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. స్పిన్నర్ అశ్విన్ బౌలింగులో బ్రేవో 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. వెస్టిండీస్ 97 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. పావెల్ రెండు పరుగుల తేడాతో అర్థ సెంచరీ మిస్సయ్యాడు 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓజా బౌలింగులో అవుటయ్యాడు. ప్రజ్ఞాన్ ఓజా మరో వికెట్ తీశాడు. అతను శామ్యూల్స్ వికెట్ తీశాడు. దీంతో వెస్టిండీస్ 140 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. శామ్యూల్స్ కేవలం 14 పరుగులు చేశాడు. 148 పరుగుల వద్ద వెస్టిండీస్ ఐదో వికెట్ కోల్పోయింది. చందర్‌పాల్ భూవనేశ్వర్ కుమార్ బౌలింగులో 25 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అవుటయ్యాడు. రామ్‌దిన్ 12 పరుగులు చేసి అవుట్ కాగా, ఆ తర్వాత ముగ్గురు బ్యాట్స్‌మెన్ భారత స్పిన్నర్ల ధాటికి డకౌట్ అయ్యారు. అంతకు ముందు భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

Recent Posts