Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బయటపడిన పవన్ సీక్రెట్ డొనేషన్


FILE

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. పవన్ కల్యాణ్‌కు ఇంత క్రేజ్ రావడానికి ఆయన సినిమాలు ఒకెత్తయితే మానవత్యం, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే గుణం ఆయనను మరో ఎత్తుకు చేర్చింది.

పవన్ కన్నా బాగా స్టెప్పులు వేయగల ఎందరో హీరోలు ఉన్నా వెండితెరపై పవన్ స్టెప్పులు వేస్తే ప్రేక్షకులు పులకరించిపోతూ ఉంటారు అదే పవన్ క్రేజ్. ఈ విషయాలన్నీ పరిశీలిస్తే పవన్‌లో నటుడిగా కన్నా మరో వ్యక్తి ఉన్నాడనిపిస్తుంది. అదే అతడి మానవత్వం. ఈ లక్షణమే పవన్‌ను పవర్‌స్టార్‌గా మార్చి అతడి అభిమానులును పవనిజం నామ స్మరణ చేసేటట్లుగా చేసింది.

నటుడిగానే కాకుండా సున్నితమైన మనస్కుడిగా పేరుగాంచిన పవన్ సమాజంలోని ఎందరో ఆర్తులకు తనవంతు సేవాకార్యక్రమాలు చేశాడన్న విషయం తెలిసిందే. దీనిపై గతంలో చాలా వార్తలు వచ్చాయి. దీనికి కొనసాగింపుగా తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది.

'గబ్బర్ సింగ్ 2' సినిమా నిర్మాణ పనులలో బిజీగా ఉన్న పవన్ మొన్న ఉదయం న్యూస్ పేపర్లను చదువుతూ ఉంటే హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఒక పేద కుటుంబానికి చెందిన ఒక చిన్న అమ్మాయి కిడ్నీ సమస్యతో బాధపడుతోంది అనే వార్తను చూసి పవన్ సేవా హృదయం స్పందించింది. కూకట్‌పల్లి‌లోని ఆ అమ్మాయి తల్లి తండ్రులను కలిసి పవన్ వారికి మనోధైర్యం చెప్పాడట.

అంతేకాకుండా ఆ అమ్మాయి వైద్య ఖర్చుల నిమిత్తం రెండు లక్షల రూపాయలు సహాయం చేశాడు అనే వార్త ఫిలింనగర్‌లో చెప్పుకుంటున్నారు. వంద రూపాయల డొనేషన్ ఇస్తే హడావిడి చేసే ఈ రోజులలో లక్షలు సహాయంగా ఇచ్చినా ఎటువంటి పబ్లిసిటీని కోరుకొని గొప్ప వ్యక్తిత్వం పవన్‌ది కాబట్టే పవన్ అంటే అంత క్రేజ్.

Recent Posts