Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సచిన్ టెండూల్కర్ 200 టెస్టు : ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్..!

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 200.. చివరి టెస్టు మ్యాచ్‌ కోసం సర్వం సిద్ధమైన నేపథ్యంలో.. ఆయన అభిమానులకు ఓ ఆన్‌లైన్ ట్రావెల్ వెబ్‌సైట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. సచిన్ గౌరవార్థం ముసాఫిర్ డాట్ కామ్ అనే ఆన్‌లైన్ ట్రావెల్ వెబ్‌సైట్ వాంఖడే స్టేడియానికి వెళ్లేవారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది.

ముసాఫిర్ డాట్ కామ్‌కు టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. తన సొంత మైదానం వాంఖడేలో ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు టెండూల్కర్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు.

ఈ నేపథ్యంలో వాంఖడే స్టేడియానికి టెండూల్కర్ అభిమానులను చేరవేసేందుకు ఆ వెబ్‌సైట్ 200 ట్యాబ్ క్యాబ్స్‌ను సమకూర్చుకుంది. ముంబైలోని వివిధ ప్రాంతాల నుంచి వాంఖడే స్టేడియానికి వాటిని నడుపుతుంది. ఐదు రోజుల పాటు ఉచితంగా వాటిలో ప్రయాణం చేయవచ్చు.

Recent Posts

సచిన్‌పై బ్రిటన్ ప్రధాని ప్రశంస: అవుటైతే హమ్మయ్య అనుకుంటా!

FILE మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ టెండూల్కర్ తన చివ(...)