Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

'రుద్రమదేవి'కి రూ. 60 కోట్లు, 'బాహుబలి'కి రూ. 100 కోట్లు... వస్తాయా...?!!

టాలీవుడ్ చిత్రాల బడ్జెట్లు భారీగా పెరిగిపోతున్నాయి. రుద్రమదేవికి రూ. 60 కోట్లు ఖర్చుపెడుతున్నారనీ, రాజమౌళి బాహుబలికి రూ. 100 కోట్లు వ్యయం చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. అగ్రహీరోల చిత్రాలను భారీ బడ్జెట్‌ పెట్టి.. సినిమా ఎక్కడికో తీసుకెళ్ళాలనుకునే నిర్మాతలు ఇప్పుడు తెలుగులో ఎక్కువయ్యారు. ఒకప్పుడు సినిమా నిర్మాణ వ్యయాన్ని హీరోలు పెంచేస్తున్నారంటూ నిర్మాతలు వాపోయేవారు. దీనికి ప్రొడక్షన్‌ కంట్రోల్‌ను ఏర్పాటు చేయాలని కూడా అప్పట్లో ఛాంబర్‌ నిర్ణయించింది.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏవో చిన్నపాటి బడ్జెట్‌తో సినిమాలు తీయాలంటే మారుతీ లాంటి దర్శకులు కొత్తవారితో తీయడం మొదలుపెట్టారు. కానీ అవేవీ ఇతరులకు వర్కవుట్‌ అవ్వడంలేదు. సినిమాను జాతీయస్థాయిలో తీసుకెళ్ళాలంటే రెండు, మూడు, నాలుగు భాషల్లో చిత్రాలు నిర్మించేట్లు అగ్ర నిర్మాతలు ప్రణాళికలు మొదలుపెట్టారు. దీనికి కార్పొరేట్‌ కంపెనీలు ముందుకు వచ్చాయి. రాబోయే కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నిర్మాణమే మారిపోతుందని ప్రముఖ నిర్మాత వెల్లడిస్తున్నారు.

ఏదో సాదాసీదా సినిమా తీస్తే.. పెద్దగా కలెక్షన్లు రావు. పోకిరి, మగధీర, ఈగ, దూకుడు, గబ్బర్‌సింగ్‌, అత్తారింటికి దారేది తరహా చిత్రాలు వస్తేనే ప్రేక్షకుల్లో క్రేజ్‌ ఉంటుంది. విడుదలైన వారంలోనే కలెక్షన్లు రాబట్టుకోవచ్చని అంచనాలు వేస్తున్నారు. ఒకప్పుడు భారీ బడ్జెట్‌ అంటే 25 నుంచి 30 కోట్ల వరకు అయ్యేది. అది 60 కోట్లకు పెరిగింది. గుణశేఖర్‌ 'రుద్రమదేవి' దాదాపు అంతే ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.

ఇప్పుడు అలా కాకుండా రాజమౌళి 100 కోట్లవరకు వెచ్చిస్తున్నాడని సినిమా వర్గాలు చెబుతున్నాయి. కాలవ్యవధి ఎక్కువైనా సినిమాను చిరస్థాయిగా తీర్చిదిద్దాలని అగ్రనిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే యుటీవీ, రిలయన్స్‌ కార్పొరేట్‌ సంస్థలు ఇక్కడి అగ్రనిర్మాతల సహకారంతో ముందుకు సాగుతున్నారు. ముందుముందు మరిన్ని కార్పొరేట్‌ కంపెనీలు వచ్చి తెలుగు సినిమాను మరింత పైకి తీసుకెళ్లే స్థితిలో ఉన్నాయని తెలుస్తోంది. ఐతే ఇంత ఖర్చు పెట్టి సినిమా తీస్తే పైసలు వస్తే ఫర్లేదు... రాకపోతే ఏంటి సంగతన్న ఆందోళనా వ్యక్తమవుతోంది.

Recent Posts

సచిన్‌పై బ్రిటన్ ప్రధాని ప్రశంస: అవుటైతే హమ్మయ్య అనుకుంటా!

FILE మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ టెండూల్కర్ తన చివ(...)