Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుడ్డోడికి నారా రోహిత్‌తో కష్టాలు: ప్రతినిధి సినిమాతో క్రేజ్ డౌన్?!

నందమూరి హీరోలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో మంచి పేరు కొట్టేశాడు. అయితే ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్‌కు ఫ్లాపుల మీద ఫ్లాపులు కష్టాలను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో నారా రోహిత్ కూడా బుడ్డోడిని టార్గెట్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

నంద‌మూరి చిన్నోడు ఎన్టీఆర్‌ను పొలిటిక‌ల్‌గా ఉప‌యోగించుకుందామ‌ని అనుకున్న చంద్రబాబు ఆలోచ‌న‌ల‌కు ఎన్టీఆర్ అంతు చిక్కడంలేదు. అందుకే నారా కుటుంబం నుండి ఒక హీరో సైలెంట్‌గా ఇండ‌స్ట్రీలోకి దూసుకు వ‌స్తున్నాడు. త‌నే నారా రోహిత్‌.

నారా రోహిత్‌కు చంద్రబాబు అండ‌దండ‌లు మెండుగా ఉన్నాయి. నారా రోహిత్ ప్రతి మూవీ ఆడియో ఫంక్షన్‌కు చంద్రబాబు నాయుడు హాజ‌ర‌వ్వడం ఆన‌వాయితీగా వ‌స్తుంది. అయితే లేటెస్ట్‌గా నారా రోహిత్ న‌టిస్తున్న చిత్రం ప్రతినిధి. ప్రతినిధి మూవీలో నారా రోహిత్ ప‌వ‌ర్ పుల్ పాత్ర పోషిస్తున్నాడ‌ని టాలీవుడ్ స‌మాచారం.

నారారోహిత్ పోషిస్తున్న పాత్ర లాంటిది ఇప్పటి వ‌ర‌కూ జానియ‌ర్ ఎన్టీఆర్ చేయ‌లేదంట‌. ప్రతినిధి మూవీతో నారా రోహిత్‌కు మంచి బ్రేక్ రావ‌డం ఖాయం అని నారా కుటుంబం ఆశిస్తుంది. అంతే కాకుండా నారారోహిత్‌కు నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ అండ‌దండ‌లు కూడ ఉన్నాయంటున్నారు. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసి.. టాలీవుడ్‌లో మంచి పేరు కొట్టేయాలని నారా రోహిత్ ఉవ్విళ్లూరుతున్నాడని సినీ ఇండస్ట్రీలో టాక్ వస్తోంది.

Recent Posts

సచిన్‌పై బ్రిటన్ ప్రధాని ప్రశంస: అవుటైతే హమ్మయ్య అనుకుంటా!

FILE మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ టెండూల్కర్ తన చివ(...)