Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

కమల్ హాసన్‌కు భయం.. భయం: సారిక జీవిత చరిత్రతో తలనొప్పి!

విశ్వరూపం 1 నుంచి కమల్ హాసన్‌కు అటు సినీ ఇండస్ట్రీలో కష్టాలు మొదలయ్యాయని అనుకుంటే.. తొలి భార్యతో మళ్లీ ఈ టాప్ హీరోకు పెద్ద తలనొప్పి వచ్చి పడేలా ఉంది. ఇదేంటబ్బా అనుకుంటున్నారా.. నిజమేనండి.. కమల్ తొలి భార్య సారిక తన మాజీ భర్త జీవిత చరిత్ర రాస్తోంది. దీంతో కమల్‌కు తలనొప్పి తప్పదని కోలీవుడ్ వర్గాల్లో టాక్.

హీరో కమలహాసన్ జీవితంలో ఉన్న మలుపులు సంచలనాలు మరి ఏ హీరో జీవితంలోను ఉండవేమో. అటువంటి హీరో జీవితం పై ఒక పుస్తకం వస్తే అది హాట్ టాపిక్ గానే మారుతుంది. ఎందుకంటే, ఆయన వృత్తిజీవితం, వ్యక్తిగత జీవితం రెండూ విచిత్రంగానే ఉంటాయి.

వివాహ వ్యవస్థపై సరైన అభిప్రాయంలేని కమల్ రెండు సార్లు పెళ్ళి చేసుకున్నాడు. ప్రస్తుతం గౌతమితో సహజీవనం చేస్తున్నాడు. అటువంటి కమల్‌తో కొన్నేళ్ల పాటు జీవితాన్ని పంచుకున్న ఆయన మాజీ భార్య సారిక స్వయంగా తన మాజీ భర్త జీవిత చరిత్ర రాస్తోంది.

అంతేకాదు ఆ జీవిత చరిత్రలో ప్రపంచానికి తెలియని కమలహాసన్ విశేషాలు చెపుతానంటోoది. ఈ వార్త తెలియగానే దేశంలోని ప్రముఖ పబ్లిషింగ్ హౌస్‌లు ఆమె ఇంటి ముందు క్యూ కట్టి ఆ పుస్తకాన్ని ప్రచురించే హక్కు తమకు ఇవ్వమని భారీ మొత్తాలు ఆఫర్ చేస్తున్నాయట.

అయితే ఈ విషయం కమల్‌కి ఏమాత్రం నచ్చడం లేదట. దీని గురించి తెలిసిన కమల్ ‘‘నా లైఫ్ కాంట్రవర్షియల్ నా అంగీకారం లేకుండా రాసే రాతలు నా పిల్లలను బాధించకూడదనుకుంటున్నాను’’ అని తన సన్నిహితుల వద్ద బాధపడినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సారిక ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.

Recent Posts