Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సినిమాల్లో సమంతకు అది నచ్చదు... తమన్నా చేసేది ఇష్టం!

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న క్రేజీ‌స్టార్ సమంతకు సినిమాల్లో ఆ ఒక్క పదం నచ్చదట. తనకు డ్యాన్స్ అంతగా రాదని ఒప్పుకుంది సమంత. ఈ విషయమై సమంత ట్విట్టర్‌లో స్పందించింది. సినిమాల్లో తనకు నచ్చని ఒకే ఒక పదం డ్యాన్స్ అని చెప్పింది. అయినా డ్యాన్సర్లందరినీ గౌరవిస్తానని తెలిపింది. ముఖ్యంగా తమన్నా డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని వెల్లడించింది.

ఒకప్పుడు హీరోయిన్ కావాలంటే చక్కని అందం, అభినయం, ఆహార్యం ఉండాలనే నియమాలు ఉండేవి. వీటి కోసం వాళ్లు ఎంతో సాధన చేసేవాళ్లు. ఇప్పటి హీరోయిన్లలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయా అంటే సమాధానం దొరకదు. ఈ తరం హీరోయిన్లలో నటన కంటే గ్లామర్‌ను నమ్ముకున్న వాళ్లే ఎక్కువ. హీరోలతో నాలుగు స్టెప్పులు వేసి అందాలరబోయడం వరకే పరిమతమైపోతున్నారు.

అయితే డ్యాన్స్ విషయంలో సమంత కాస్త వెనకబడిందని చెప్పవచ్చు. పాటల చిత్రీకరణలో సమంత పలు టేక్‌లు తీసుకుంటోందట. అందుకు కారణం ఆమెకు డ్యాన్స్ మూవ్‌మెంట్స్ సరిగా రాకపోవడమే. అందుకే డ్యాన్స్ మాస్టర్లు తక్కువ మూవ్‌మెంట్స్ ఉండే స్టెప్పులను సమంతకు కంపోజ్ చేస్తున్నారట. ప్రస్తుతం ఆమె నెంబర్‌వన్ హీరోయిన్ కాబట్టి సమంత ఎలా చేసినా దర్శకులు సర్దుకుపోవాల్సిందేనని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Recent Posts