Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ప్రపంచ చౌక టాబ్లెట్ పీసీ ఆకాష్‌ని ఆవిష్కరించిన భారత్

రూ.2,276 విలువైన ప్రపంచంలోనే చౌకైన టాబ్లెట్ పర్సనల్ కంప్యూటర్ (పీసీ)ని భారత్ బుధవారం ఆవిష్కరించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా విద్యని విస్తరించాలనే ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులకు ఈ కంప్యూటర్ దాదాపు సగం ధరకే లభిస్తుంది.

ఆకాష్‌గా పిలవబడే ఈ టాబ్లెట్ పీసీ కోసం ప్రభుత్వానికి రూ.2,276 వ్యయం అవుతుంది. విద్యార్ధులకు సుమారు 50 శాతం సబ్సిడీతో ఈ పీసీని అందించనున్నట్లు మానవవనరుల శాఖ మంత్రి కపిల్ సిబల్ ఆకాష్‌ని బుధవారం ఆవిష్కరించే సందర్భంగా పేర్కొన్నారు. ఈ పీసీ 7 అంగుళాల టచ్‌స్క్రీన్ పరికరం.

"ధరలో పన్నులు, రవాణా వ్యయం కలిసి వున్నాయి. దీన్ని కొనుగోలు చేసే విద్యా సంస్థలకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ కల్పిస్తుంది. విద్యా సంస్థలకు ఇది రూ.1,100-రూ.1,200 వ్యయం అవుతుంది" అని ఆయన చెప్పారు. ఈ కంప్యూటర్‌ని సుమారు రూ.500కి అందివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నట్లు సిబల్ తెలిపారు. "తయారీని పెంచినట్లయితే ధరలు తగ్గుతాయి. రానున్న సంవత్సరాల్లో పిల్లలకు 10 డాలర్లకే టాబ్లెట్ అందించడం నా లక్ష్యం" అని సిబల్ పేర్కొన్నారు.

ఈ టాబ్లెట్ పీసీలను తయారుచేసే కెనడా సంస్థ డేటావిండ్‌కి ప్రభుత్వం లక్ష కంప్యూటర్ల కోసం ఆర్డర్ ఇచ్చింది. నవంబర్ నుంచి ఈ చౌక కంప్యూటర్లని రూ.2,999 ధరకి బహిరంగ మార్కెట్‌లో విక్రయించాలని డెటావిండ్ భావిస్తున్నది.

గూగూల్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 2.2 ఆధారంగా పనిచేగా 7 అంగుళాల స్క్రీన్ కలిగిన ఆకాష్ టాబ్లెట్ పీసీలో 366 మెగాహెడ్జ్ ప్రాసెసర్, 256 ఎంబీ ర్యామ్, 32 జీబీ వరకూ స్టోరేజ్ కెపాసిటీ వంటి సౌకర్యాలు ఉన్నాయి. బ్యాటర్ ప్యాకప్ 180 నిమిషాలు.

Recent Posts