Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఓ గంట సెక్స్‌ చేస్తానంటున్నాడు.. కండోమ్ - ఐపిల్ వాడుతాడట.. ఓకే చెప్పొచ్చా?

చాలా మంది యువతులు ఐటీ కంపెనీలు, మల్టీ నేషనల్స్ కంపెనీల్లో పని చేస్తుంటారు. ఇలాంటి యువతులను తోటి కొలీగ్స్ తమ మాటల చాతుర్యంతో సులభంగా బుట్టలో పడేస్తుంటారు. కొద్ది రోజుల పరిచయం తర్వాత డేటింగ్ పేరుతో ఓ గంట సెక్స్‌కు ప్రపోజ్ చేస్తుంటారు. దీనికి కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తే.. గర్భం రాకుండా ఉండేందుకు కండోమ్ వాడుతానని, సెక్స్‌కు ముందుగా ఐపిల్ వాడుతానంటూ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ప్రపోజల్స్‌కు కొంతమంది యువతులు సమ్మతం చెపుతుంటారు. మరికొందరు సున్నితంగా తిరస్కరిస్తుంటారు. అసలు ఇలాంటి ప్రపోజల్స్‌కు సమ్మతించడం మంచిదా కాదా ఇక్కడ తెలుసుకుందాం.

ఇలా ప్రతిపాదించే యువకులు స్త్రీని ఒక లైంగిక సరకుగా మాత్రమే చూస్తున్నారన్న విషయాన్ని గుర్తించాలి. ప్రేమ విలువలు లేకుండా ఒక అపరిచితురాలితో, అపరిచితుడితో సెక్స్‌లో పాల్గొనాలన్న కోరికకు పునాది తాత్కాలిక మోహంగా భావించాలి. కండోమ్‌కి కంటికి కనబడని చిల్లులుంటాయి. ఐపిల్ వల్ల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

సెక్స్ అంటే ఒక కప్ ఆఫ్ టీ కాదని విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎప్పుడంటే అప్పుడు, ఎవరితో అంటే వారితో అనుభవించడానికి సెక్స్ ఆట వస్తువు కాదు. సెక్స్ అనేది దంపతులు పరస్పరం ఒకరిపై ఒకరికున్న ప్రేమను, అనురక్తిని వ్యక్తపరుచుకునే అందమైన దేహభాష మాత్రమే! వివాహం తర్వాత మాత్రమే సెక్స్ అనుభవం సురక్షితం!

Recent Posts