Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఎక్కువసార్లు సెక్స్ చేసి వీర్యాన్ని స్ఖలిస్తే... సిక్స్ ప్యాక్ బాడీకి నష్టమా...?

నేను టీనేజ్ నుంచి నా బాడీని కండిషన్‌లో పెట్టుకుంటూ వస్తున్నా. నాది సిక్స్ ప్యాక్ బాడీ. ఇటీవలే పెళ్లయింది. నా భార్య పలుమార్లు రతి సుఖాన్ని కోరుకుంటుంది. నాకూ ఆమె కోరినప్పుడల్లా సెక్స్ చేయాలనే ఉంటుంది. కానీ నా స్నేహితుడు ఓ విషయం చెప్పాడు. అదేమంటే, ఎక్కువసార్లు సెక్సులో పాల్గొని వీర్యాన్ని స్ఖలిస్తే సిక్స్ ప్యాక్ బాడీ బలహీనమవడమే కాకుండా అనారోగ్యం వస్తుందని చెపుతున్నాడు. నా భార్య రోజుకు నాలుగుసార్లు సెక్స్ కావాలని గొడవ చేస్తోంది. ఏం చేయాలో అర్థం కావడంలేదు...

ఎక్కువసార్లు సెక్స్ చేసినందువల్ల ఎలాంటి నష్టం లేదు. అయితే అదేపనిగా సెక్స్ చేయాలన్నా ఎవరూ చేయలేరు. ఇకపోతే సెక్స్ కోర్కెలను మనసులో అదిమిపెట్టి ఉంచడం వల్ల అది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సెక్సులో పాల్గొనకుండా ఉంటే ఆరోగ్యం చాలా బావుంటుందనీ, శక్తి కూడా పెరుగుతుందని చాలామంది మగవారు అనుకుంటుంటారు.

కానీ శరీరంలో కామవాంఛ కలిగినప్పుడు దానిని అదిమిపట్టేసి సెక్స్ చేయకుండా ఉండటం వల్ల మానసికపరమైన చిక్కులు తలెత్తుతాయి. దీనివల్ల నిద్రపోవడం తగ్గిపోతుంది. చిరాకు, ఆదుర్దా పెరుగుతుంది. సెక్స్ అంగాలకు పని పెట్టకుండా ఖాళీగా ఉంచడం వల్ల వాటి సామర్థ్యం కూడా తగ్గుతుంది. కనుక సెక్స్ కోర్కెను తీర్చుకోవడానికి సిక్స్ ప్యాక్ బాడీ బలహీనమైపోవడానికి ఎలాంటి సంబంధం లేదు.

Recent Posts