Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఐసీసీ ర్యాంకుల పట్టిక : బెస్ట్ ఆల్‌రౌండర్‌గా అశ్విన్

భారత ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో నెంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా అవతరించాడు. వెస్టిండీస్‌తో తొలిటెస్టులో అటు బ్యాటుతోనూ, ఇటు బంతితోనూ రాణించిన అశ్విన్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా వెల్లడించిన ర్యాంకింగ్స్‌లో అశ్విన్ ఆల్‌రౌండర్ల జాబితాలో మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నాడు.

కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ అద్భుతంగా ఆడి సెంచరీ చేసిన విషయం తెల్సిందే. దీంతో పాటు.. బంతితో రాణించి ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో 81 రేటింగ్స్ పాయింట్లు సాధించిన అశ్విన్ (405), బంగ్లాదేశ్ ఆటగాడు షకీబల్ హసన్ (362)ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఇక బౌలర్ల జాబితాలో రెండు స్థానాలు మెరుగుపరచుకొని ఆరో ర్యాంకు సాధించాడు. కాగా, కోల్‌కత మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ, పేస్‌బౌలర్ షమీలు ర్యాంకింగ్స్ జాబితాలో అడుగుపెట్టారు.

Recent Posts

సచిన్‌పై బ్రిటన్ ప్రధాని ప్రశంస: అవుటైతే హమ్మయ్య అనుకుంటా!

FILE మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ టెండూల్కర్ తన చివ(...)