Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

నా భర్త స్టేట్స్‌లో ఉన్నాడు... కొలీగ్‌పై ఇష్టం కలుగుతోంది.. ఏం చేయాలి?

మాది గుంటూరు జిల్లా. మాకు వివాహమై యేడాది అయింది. నా భర్త పై చదువుల కోసం స్టేట్స్‌కి వెళ్ళారు. ప్రస్తుతం నేను జాబ్ చేస్తున్నా. ఈ మధ్యకాలంలో నాకు కొలీగ్ పట్ల ఇష్టం ఏర్పడింది. అతనూ నా పట్ల ఆకర్షితులవుతున్నాడు. భర్త దూరంగా ఉండటమే నాలో ఈ మార్పులకు కారణమా? లేక.. మరేదైనా కారణమా? నన్ను ఏం చేయమంటారు?

సాధారణంగా మానవ లైంగికత అనేది కేవలం భౌతిక పరమైన అంశం మాత్రమే కాదు. ఆలోచనా స్థాయిలో అది పూర్తి భావోద్వేగాలకు సంబంధించిన ప్రతిస్పందన. లైంగికత అనేది మానవ వ్యక్తిత్వంలో ఒక భాగం మాత్రమే.

సెక్స్‌ను మనం ఏ ధృక్పథంలో చూస్తామన్న దాని మీదే మన లైంగిక ప్రవర్తన నిర్ణయాలు ఉన్నాయి. వివాహేతర సంబంధాలు ఎప్పుడూ తీవ్రమైన సామాజిక, కుటుంబ సమస్యలను సృష్టిస్తాయి. దంపతుల మధ్య పరస్పరం నమ్మకం, గౌరవం, విలువలు కలిగి ఉండటం ముఖ్యం. అందువల్ల అతనితో దూరంగా ఉంటూ... వీలైనంత త్వరగా మీ భర్తను మీ దగ్గరకు వచ్చేలా చేసుకోండి. అదే మీ సమస్యకు పరిష్కారం.

Recent Posts