Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ప్రభాస్ పెళ్లిచేసుకోబోయేది ఆ అమ్మాయినా?

ప్రభాస్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం చారిత్రాత్మక నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇక ఈ మూవీ కోసం ప్రభాస్ రాజమౌళికి రెండేళ్ల వరకూ డేట్స్ కేటాయించాడు. అయితే ఈ సినిమా అనుకున్న టైమ్‌లో పూర్తికావడం కష్టమని తెలుస్తోంది. ఆ విషయం స్వయానా జక్కన్నే చెప్పాడు.

ఈమధ్య బాహుబలికి సంబంధించి ఫస్ట్‌లుక్ విడుదలయినప్పుడు కూడా 2015కి రిలీజ్ అని వేశారు. దీనితో పాటు మూవీ నిడివి ఎక్కువ కావటంతో రెండు భాగాలుగా విడుదల చేద్దామని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రభాస్ ఫ్యామిలీ వెంటనే పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారట.

ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందే పెళ్లి సంబంధాలు చూశారు. వెంటనే జక్కన్న మూవీ ఓకే కావటం... పెళ్లిని వాయిదా వేయటం జరిగింది. ఇప్పటికే ఇతనికంటే చిన్నవయసు ఉన్న హీరోలు కూడా పెళ్లిళ్లు చేసుకున్నారు. అందుకే 2015 వరకూ ఆగడం కష్టమని... పెళ్లి కన్ఫర్మ్ అని... ఫిల్మ్‌నగర్ టాక్. ఇక ప్రభాస్‌కు పెళ్లి చూపులు కూడా మొదలెట్టారని సమాచారం.

దీనిలో భాగంగా... కృష్ణంరాజు బంధువుల అమ్మాయి రెడీగా ఉందని, ఆమెను ప్రభాస్ ఓకే చేయడమే మిగిలిందనే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ పెళ్లి విషయంలో ఇప్పటివరకూ కండీషన్స్ పెట్టిన రాజమౌళి కూడా పెళ్లికి ఓకే అన్నాడట. దీంతో త్వరలోనే 'డార్లింగ్' మూడుముళ్లు వేసేందుకు సిద్ధమవుతున్నాడట. 'బాహుబలి' విడుదలకు ముందే పెళ్లితో పాటు హనీమూన్ కూడా పూర్తవుతుందట.

Recent Posts