Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

తొలి రాత్రిని పూర్తిస్థాయిలో ఆస్వాదించడం ఎలా?





వివాహం తర్వాత జీవిత భాగస్వామితో పడక గది జీవితం సుఖమయం కావాలనుకుంటున్నారా? పడక గదిలో ఎవరెలా ప్రవర్తించాలనే విషయాన్ని గురించి ఇప్పుడయితే రకరకాల పుస్తకాలు అందుబాటులో ఉంటున్నాయి కానీ, గతంలో(కామసూత్ర గురించి కాదు) ఇవేమి లేవు. అసలు ఈ మ్యాటర్ గురించి చర్చించడానికే సిగ్గుపడిపోయే సమాజం మనది. ఇటువంటి పరిస్థితులు ఇప్పుడిప్పుడే మారుతున్నాయి. వివాహమయిన తర్వాత తొలి రాత్రి ఎలా ఉంటుందనే భయం, అనుమానం ఉండటం అనేది సహజమే అయినా, వాటిని అధిగమించడమనేది మన చేతిలోనే ఉందంటున్నారు సెక్సాలజిస్టులు.

ఇందుకు ఎవరి సాయమూ అక్కరలేదు. కొత్తగా మీ జీవితంలో ప్రవేశించిన భాగస్వామికి స్వాగతం పలకాలి. వెంటనే రంగంలోకి దిగేయకుండా కొంతసేపు మనసు విప్పి మాట్లాడాలి. మృదువుగా తాకాలి..ఇకపై నేను నీకు తోడు అంటూ చెప్పేలా ఆ తాకిడి ఉండాలి. మీరు మీ భాగస్వామిని తొలి రాత్రి పట్ల ఉన్న భయాలను, భావాలను తప్పకుండా అడిగి తెలుసుకోవాలి.

ఇలా అడిగినప్పుడు తన మనస్సులో ఉన్న అపోహలు, భయాలు లేదా మొదటి రాత్రి కోర్కెలు, ఇటువంటి వాటి గురించి మీతో చెప్పుకునే అవకాశాన్ని వారికి ఇవ్వాలి, ఇక తన చెప్పినదానికి తగినట్టుగా నడుచుకోగలితే మీ తొలి రాత్రి సంతోషమయమౌతుంది.

కొత్త దంపతులు సెక్స్‌లో పాల్గొనేటప్పడు గుడ్డిగా ఎదో చేస్తే అయిపోతుందిలే అనుకోకూడదు. ఇలా సెక్స్‌లో పాల్గొనడం వలన తొలి రాత్రిలోని అద్భుతాన్ని మిస్ కావడమే కాకుండా భాగస్వామి సెక్స్ సమయంలో భయపడటమో లేదా మొదటి రాత్రిలో అసౌకర్యం కలగడం వలన, తనకు చిరాకు ఇంకా తప్పుగా భావించే అవకాశం చాలా ఉంది. సెక్స్ మధ్యలో భాగస్వామితో మాట్లాడుతూ (అసభ్యంగా కాదు) ఆమెను సంతోషపరచాలి.

రతి సమయంలో బ్లీడ్ అయితే..?

మొదటిసారి స్త్రీ తన కన్యత్వాన్ని కోల్పోతున్నప్పడు, కొంత వరకు నొప్పిగా ఉండటంతో పాటు కొంత రక్త చారికలు కూడా కనిపించవచ్చు. అయినా ఇది అంత పెద్ద విషయం కాదు, చాలా వరకు అందరు ఆ నొప్పిని అనుభవించినవారే. కనుక దాని గురించి అస్సలు పట్టించుకోకూడదు, జాగ్రత్తలు మాత్రం ఎవరో ఒకరు పాటించాల్సిందే.

మొదట్లో సెక్స్ అనేది అది చేసుకునే వారిని బట్టి ఉంటుంది. అయినా, మొదట్లో కాస్త ఇబ్బందిగా ఉన్నా పోనుపోను ఎలా చేయాలో తెలుస్తుంది. భాగస్వామికి తగినట్టుగా నడుచుకుంటే, సెక్స్ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. సెక్స్ సమయంలో ఇతర ఆలోచనలు పెట్టుకోకూడదు.

Recent Posts