Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

రోహిత్ శర్మ దీపావళి డబుల్ ధమాకా... 57 పరుగుల తేడాతో భారత్ విజయం

రోహిత్ శర్మ దీపావళి డబుల్ ధమాకాను చేరుకునే క్రమంలో ఆసీస్ జట్టు చతికిలపడింది. 384 భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ అలసిపోయి భారత్ ముందు చేతులెత్తేసింది. దీంతో 57 పరుగుల తేడాతో భారత్ జట్టు విజయం సాధించింది.

లక్ష్య ఛేదనకు బ్యాటింగుకు దిగిన ఫించ్ -హగ్స్ క్రీజులో ఎక్కువసేపు నిలువలేకపోయారు. ఫించ్ 5 పరుగులు, హగ్స్ 23 పరుగులకు ఔటయ్యారు. ఆ తర్వాత హేడిన్ 40, బెయిలీ 4, వోగ్స్ 4, మాక్సువెల్ 60తో పెవిలియన్ చేరుకున్నారు. ఫల్కనర్ భారత్ బౌలర్లను కాస్త భయపెట్టాడు. 73 బంతుల్లో 116 కొట్టి చమట్లు పట్టించాడు. ఐతే వికెట్లు పడిపోతుండటంతో అతడు కూడా ఒత్తిడికి గురయి షామి బౌలింగులో ధావన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక వాట్సన్ 49, నైల్ 3, కే 18 పరుగులు చేశారు. మరో 4.5 ఓవర్లు మిగిలి ఉండగానే ఆసీస్ మ్యాచ్ ముగిసింది. 326 పరుగులు మాత్రమే రాబట్టబలిగారు. దీంతో విజయం భారత్ వశమైంది.

ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ దీపావళి డబుల్ ధమాకా రుచి చూపించాడు. డబుల్ సెంచరీ(2x100) నమోదు చేసుకుని కేవలం 158 బంతుల్లో(16x6), (12x4) కొట్టి 209 పరుగులు చేశాడు. దీంతో భారత్ జట్టు ఆసీస్ ముందు 384 భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది.

ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య జరుగుతున్న 7వ ఒకరోజు వన్డే పోటీలో భాగంగా ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ధావన్ క్రీజులోకి వచ్చారు. ఇద్దరూ కలిసి 112 పరుగుల భాగాస్వామ్యాన్ని చేశారు.

19వ ఓవర్లో ధావన్(60) దోహర్టి విసిరిన బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లి(0) రనౌట్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా గ్యాలరీలో నిరుత్సాహం. రైనా వచ్చాడు. మెరిపిస్తాడనుకుంటే 30 బంతులకి 28 పరుగులు చేసి దోహర్టి బౌలింగులో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ దారి పట్టాడు. ఆ దశలో భారత్ స్కోరు 185.

యువరాజ్ సింగ్ ఒకే ఒక్క సిక్సర్ ఇచ్చుకుని 12 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత రోహిత్ శర్మకు కెప్టెన్ ధోనీ సహకారం తోడవడంతో విజృంభించాడు. వీరకొట్టుడు కొట్టాడు. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీ చేసి భారత్ ఆటగాళ్లలో ఈ ఫీట్ చేసిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ధోనీ 38 బంతుల్లో 62 పరుగులు చేయడంతో ఇండియా 6 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది.

Recent Posts