Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సచిన్‌కు ఘనంగా వీడ్కోలు: ముంబై క్రికెట్ సంఘం ఏర్పాట్లు

భారత బ్యాటింగ్ స్టార్ సచిన్ తెండూల్కర్‌కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) సిద్ధమవుతున్నది. అతని ఫొటో ఉన్న ప్రత్యేక బంగారు నాణాన్ని టాస్‌కు ఉపయోగించనుంది. అదే విధంగా అతని పేరుతో ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది.

కెరీర్‌లో ఇప్పటి వరకూ 198 టెస్టులు ఆడిన సచిన్ ఈ నెల వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల అనంతరం రిటైర్ అవుతున్న విషయం తెలిసిందే. 199వ టెస్టును కోల్‌కతాలో, చివరిదైన 200వ టెస్టును స్వస్థలమైన ముంబయిలో సచిన్ ఆడతాడు.

అంతర్జాతీయ క్రికెట్ బ్యాటింగ్ విభాగంలో దాదాపు అన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సచిన్‌కు కనీవినీ ఎరుగని రీతిలో వీడ్కోలు పలికేందుకు ఎంసిఎ సమాయత్తమవుతున్నది.

Recent Posts