Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ప్రియురాలిపై పగ... అడ్డంగా బుక్కైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్!

మాజీ‌ ప్రియురాలిపై పగ తీర్చుకోబోయి అడ్డంగా బుక్కయ్యాడు ఓ స్టాఫ్‌వేర్ ఇంజనీరు. ఇతగాడి నిజ స్వరూపం బయటపడి చివరకు పోలీసులకు చిక్కాడు. హౌరాలోని బేలూరు ప్రాంతానికి చెందిన ఓ ఇంజనీర్‌ - బిస్వా‌రాయ్‌లు మూడేళ్లపాటు ప్రేమించుకున్నారు. ఏడాది కిందట వీరి రిలేషన్ ఫెయిలయ్యింది.

ఆమెతో సంబంధం కొనసాగించేందుకు బిస్వా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రిలేషన్ కొనసాగించేందుకు ఆమె కూడా నిరాకరించింది. దీంతో ఆమెపై పగ తీర్చుకోవాలనుకుని ప్లాన్ చేశాడు బిస్వా. తొలి ప్రయత్నంగా ఆమె ఫేస్‌బుక్ అకౌంట్‌ను హ్యాక్‌చేశాడు. ఆ తర్వాత అసభ్యకర సందేశాలు పంపించడం మొదలుపెట్టాడు. కొద్దిరోజుల తర్వాత ఆమె పేరు మీద ఓ ఫేక్ ఈ-మెయిల్ ఐడిని సృష్టించాడు.

దానిద్వారా అసభ్యకర సందేశాలు, ఫొటోలు పంపించడం ప్రారంభించాడు. ప్రియుడు టార్చర్ తట్టుకోలేని ఆ యువతి.. బేలూరు పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదులో ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు అన్ని విషయాలను చేధించారు. ఈ శాడిస్టు బిస్వాని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో నాలుగు దెబ్బలు పడేసరికి ఇతగాడు చేసిన తప్పులను ఒప్పుకున్నాడు. చివరకు వీడ్ని అరెస్టు చేసిన పోలీసులు.. కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.

Recent Posts