Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోదరి మానం కాపాడేందుకు ప్రాణాలు పణంగా పెట్టిన సోదరుడు

ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారాలకు, అరాచకాలకు అంతేలేకుండా పోతోంది. తాజాగా తన సోదరి సామూహిక అత్యాచారానికి గురికాకుండా కాపాడేందుకు తన ప్రాణాలు పణంగా పెట్టాడు ఓ సోదరుడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ చౌరసి ప్రాంతంలోని అలెఖెదా గ్రామానికి చెందిన రంజిత్ 9వ తరగతి చదువుతున్న తన సోదరితో కలిసి బాయ్ దూజ్ వేడుకలకు బయల్దేరాడు.

వారు ఉన్నవ్ గ్రామ సమీపంలోకి చేరగానే వారి గ్రామానికే చెందిన ముగ్గురు యువకులు ఆ బాలికను ఓ ఇంట్లోకి తీసుకుపోయేందుకు ప్రయత్నించారు. దీంతో రంజిత్ వారిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో వారి దాడికి అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఆ బాలికను ముగ్గురు దుండగులు సామూహిక మానభంగం చేశారు. ఎలాగోలా ఇల్లు చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది.

దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను మహేంద్ర, నందకిషోర్‌గా గుర్తించినట్టు తెలిపారు. మరొక నిందితుడ్ని గుర్తించాల్సి ఉందన్నారు.

Recent Posts