Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శ్వేతా మీనన్ యూ-టర్న్ తీసుకోవడం వెనుక కారణం ఏమిటి?

శ్వేతా మీనన్‌ వ్యవహారంపై మాలీవుడ్‌లో నలుగురు నానా విధాలుగా మాట్లాడుకుంటున్నారు. తొలుత కాంగ్రెస్ ఎంపీ పితాంబర కురూప్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, ఓ పబ్లిక్ మీటింగ్ ఫంక్షన్‌లో ఎక్కడబడితే అక్కడ తడుముతూ మీదమీద పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్వేతా.. తర్వాత తన ఫిర్యాదుని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

స్టేజీవద్దకు వెళ్తుండగా కురూప్ తన నడుం చుట్టూ చేతులేసి అక్కడికి తీసుకెళ్లాడని, స్టేజీపై కూడా నిల్చున్నా, కూర్చున్నా మీదమీదపడినట్లు వ్యవహరించి నలుగురిలో తనని అవమానించాడని చెప్పిన శ్వేతామీనన్ అంత రాద్ధాంతం చేసినా ఉన్నట్లుండి అతన్ని పెద్దమనసుతో ఎందుకు క్షమించేసింది అనే ప్రశ్న తలెత్తుతోంది.

పరువు పోయింది మొర్రో అని మొరపెట్టుకున్న శ్వేత ఒక్కసారిగా యూ టర్న్ తీసుకోవడం వెనుక కారణం ఏంటి? ఈ కేసుని పెద్ద చేసి తన పరువు తీయొద్దంటూ కురూప్ నుంచి ఏమైనా ఒత్తిళ్లు వచ్చాయా? లేదంటే కోర్టు వరకు వెళ్లకుండానే పరువు నష్టం దావా కింద పెద్దమొత్తంలో కురూప్ ఏమైనా శ్వేతాకి సమర్పించుకున్నాడా? ఏదో ఓ అవగాహనా ఒప్పందం కుదరందే శ్వేతా అంత వీజీగా మనసు మార్చుకోదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Recent Posts