Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

నా భర్త పక్కింటి మహిళకు పోర్న్ సీడీలు ఇవ్వమంటున్నారు.. ఏం చేయాలి?

నాకు వివాహమై పదేళ్లు అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవలే మా ఇంటి పక్కన అద్దెకు ఓ కాపురం వచ్చింది. ఆమె వచ్చినప్పటి నుంచి నా భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఒకరోజున ఉన్నట్టుండి ఒక పోర్న్ సీడీ తెచ్చి.. పక్కింటి ఆవిడకు ఇవ్వమని చెప్పాడు. నేను నిర్ఘాంతపోయాను. ఏం చేయాలో తోచక మొదటిసారి ఆయన చెప్పినట్టే చేశాను. ఆమె ఆ సీడీని చూసి తిరిగి నా చేతికే ఇచ్చింది. ఆ తర్వాత నా భర్తకు, ఆమెకు ఇదే అలవాటుగా మారిపోయింది. నేను ఈ విషయాన్ని బయటకు చెప్పి కాపురాన్ని నాశనం చేసుకోలేను. పరిష్కారం మార్గం మీరే చెప్పండి ప్లీజ్.

గతాన్ని తలచుకుని కుమిలిపోవడం కంటే.. భవిష్యత్‌లో ఇలాంటిది చోటుచేసుకోకుండా జాగ్రత్తగా మసలుకోవడం ఉత్తమం. కుటుంబంలో భర్త పాత్ర చాలా ప్రధానమైనది. అందువల్ల ఆయన బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. అలాకానీ పక్షంలో భార్యే ఆ బరువుబాధ్యతలను మోయాల్సి ఉంటుంది.

ఇక్కడ మీ భర్తలో పక్కింటి ఆవిడను చూసినప్పటి నుంచి మార్పు వచ్చినట్టుగా తెలుస్తోంది. అదేసమయంలో మీపై మోజు తగ్గినట్టుగా చెప్పొచ్చు. పక్కింటి మహిళ కూడా మీ భర్తకు మరింత చనువు ఇచ్చి ఉండొచ్చు. అందుకే వారిద్దరి మధ్య జరిగే తప్పు భవిష్యత్‌లో మీకు తెలిస్తే అది పెద్దది కాకుండా ఉండేందుకు మిమ్మలను ఉద్దేశ్యపూర్వకంగానే ముగ్గులోకి లాగినట్టుగా తెలుస్తోంది.

అంటే మీకు తెలిసే మీ భర్త పక్కింటి ఆవిడతో వివాహేతర సంబంధం నెరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితిని ప్రోత్సహించకూడదు. మీ ఆయన వ్యక్తిత్వ ప్రభావం మీ పిల్లలపై పడుతుంది.

అందువల్ల భర్తగానే కాకుండా తండ్రిగా పిల్లలపట్ల ఆయనకు గల బాధ్యతను మీరే గుర్తు చేయాలి. అంతేకాకుండా జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించకుండా జాగ్రత్తపడండి. ఆయన పట్ల మరింత ప్రేమ చూపిస్తూ ఆయనను మార్చుకునేందుకు ప్రయత్నం చేయండి.

Recent Posts