Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఐదు పార్టీలకే జీవోఎం ఆహ్వానం: 12న విడివిడిగా చర్చలకు పిలుపు!

రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)తో ఈ నెల 12వ తేదీన ఢిల్లీలో చర్చలకు రావాలంటూ కేంద్ర హోంశాఖ రాష్ట్రంలోని ఐదు పార్టీలను ఆహ్వానించింది. ఇంతకుముందు చెప్పినట్లుగా ఎనిమిది పార్టీలతో అఖిలపక్ష సమావేశం కాకుండా.. జీఓఎంకు అభిప్రాయాలు తెలియజేసిన పార్టీలు - కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీఐ, బీజేపీ, ఎంఐఎంలను మాత్రమే చర్చలకు పిలిచింది.

విభజనను వ్యతిరేకిస్తూ జీవోఎంను బహిష్కరించిన వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎంలను చర్చలకు పిలవకూడదని నిర్ణయించింది. విభజనకు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పకుండా గోడ మీది పిల్లి వాటం ప్రదర్శిస్తున్న తెలుగుదేశం పార్టీని కూడా చర్చలకు పిలవలేదు.

ఆహ్వానించిన ఐదు పార్టీల్లో ఒక్కో పార్టీతో జీఓఎం విడివిడిగా సమావేశమై చర్చిస్తుందని హోంశాఖ పేర్కొంది. ఒక్కో పార్టీకి అరగంట సమయం కేటాయించారు. దీనికి సంబంధించి హోంశాఖ నుంచి ఆయా పార్టీల నేతలకు బుధవారం ఫోన్లో సమాచారం అందించినట్లు తెలిసింది.

12న పార్టీలతో జీఓఎం భేటీలు ఇలా..
ఉదయం 11.00 గంటలకు: ఎంఐఎం
ఉదయం 11.30 గంటలకు: బీజేపీ
మధ్యాహ్నం 12.00 గంటలకు: సీపీఐ
సాయంత్రం 5.00 గంటలకు: కాంగ్రెస్
సాయంత్రం 5.30 గంటలకు: టీఆర్‌ఎస్

Recent Posts