Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

రైళ్లు పరుగెట్టిస్తున్న షేన్: 83 రన్స్‌కే ఐదు వికెట్లు

కోల్‌కతా: వెస్టిండీస్ బౌలర్ షేన్ షిల్లింగ్‌ఫోర్డు భారత బ్యాట్స్‌మెన్ గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాడు. భారత తొలి ఇన్నింగ్సులో 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ మూడు పరుగులు మాత్రమే చేసి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. అంతకు ముందు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన 199వ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో గురువారం ఈడెన్ గార్డెన్ ప్రేక్షకులను నిరాశపరిచారు. కేవలం పది పరుగులు మాత్రమే చేసి షిల్లింగ్‌ఫోర్డుకు దొరికిపోయాడు. అంతకు ముందే ఛతేశ్వర్ పుజారా పెవిలియన్ దారి పట్టాడు. షిల్లింగ్ ఫోర్డు మూడు వికెట్లు పడగొట్టాడు. గురువారం రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే భారత్ ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. భారత్ 52 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. శిఖర్ దావన్ 23 పరుగులు, మురళీ విజయ్ 26 పరుగులు చేసి అవుటయ్యారు. రెండు వికెట్లు కూడా షిల్లింగ్‌ఫోర్డుకు లభించాయి. సచిన్ టెండూల్కర్, ఛతేశ్వర్ పుజారా ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్, వెస్టిండీస్ తొలి టెస్టు లైవ్ స్కోరు కార్డు తొలి రోజు ఆట వెస్టిండీస్‌పై జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. మురళీ విజయ్ 16 పరుగులతో, శిఖర్ ధావన్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు వెస్టిండీస్‌పై భారత బౌలర్ల హవా కనిపించింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్సులో 78 ఓవర్లలో 234 పరుగులు మాత్రమే చేసింది. తొలి టెస్టు మ్యాచులోని మొహమ్మద్ షమీ తన సత్తా చాటాడు. వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ మాత్రమే కాస్తా నిలదొక్కుకున్నాడు. అతను 65 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 

          భారత బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు తీయగా, అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్, ఓజాలకు చెరో వికెట్ దక్కాయి. సచిన్ టెండూల్కర్ కూడా ఓ వికెట్ కూడా తీశాడు. టెండూల్కర్ షిల్లింగ్‌ఫోర్డ్‌ను ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్బీడబ్ల్యు చేసి వెనక్కి పంపించాడు. టెస్టుల్లో సచిన్‌కు ఇది 46వ వికెట్. షిల్లింగ్ రూపంలో వెస్టిండీస్ 192 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది. వెస్టిండీస్ 211 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. పెర్మాల్ అశ్విన్ బౌలింగులో 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. వెస్టిండీస్‌పై భారత బౌలర్ల హవా కొనసాగుతోంది. 233 పరుగుల వద్ద వెస్టిండీస్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. చందర్‌పాల్ కేవలం 36 పరుగులు చేసి అశ్విన్ బౌలింగులో అవుటయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 34 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. క్రిస్ గేల్‌ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. వెస్టిండీస్ మరో వికెట్ కోల్పోయింది. 47 పరుగుల వద్ద మొహమ్మద్ షమీ బౌలింగులో కీరోన్ పావెల్ 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో మార్లోన్ శామ్యూల్స్, డారెన్ బ్రేవో ఆచితూచి ఆడుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. శామ్యూల్స్ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. వెస్టిండీస్ 138 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అతి కష్టంగా బ్యాటింగ్ చేస్తున్న బ్రేవో ఎట్టకేలకు రన్నవుట్ అయ్యాడు. అతను కేవలం 232 పరుగులు మాత్రమే చేశాడు. వెస్టిండీస్ 143 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగులో రామ్‌దిన్ నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. వెస్టిండీస్ 172 పరుగుల వద్ద డారెన్ సామీ రూపంలో ఆరో వికెట్ కోల్పోయింది. ఓజా బౌలింగులో అతను భువనేశ్వర్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరుకున్నాడు.

 తుది జట్లు భారత్: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, ఛతేశ్వర్ పుజారా, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ, ప్రజ్జాన్ ఓజా

 వెస్టిండీస్: డారెన్ సామీ (కెప్టెన్), క్రిస్ గేల్, కీరోన్ పావెల్, డారెన్ బ్రేవో, మార్లోన్ శామ్యూల్స్, చంద్రపాల్, దినేష్ రామ్‌దిన్, షేన్ షిల్లింగ్‌ఫోర్డ్, వీరసామీ పెర్మాల్, షెల్డన్ కోట్రెల్, టినో బెస్ట్

Recent Posts