Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఫోటో జర్నలిస్టు రేప్ : దారుణంగా రేప్ చేశారు.. వాళ్లని కొట్టాలనుంది

తనపై దారుణంగా అత్యాచారం జరిపి, దుర్భాషలాడుతూ తనను కొట్టిన రేపిస్టులను తాను కూడా కొడతానని, అందుకు అనుమతించాలని ఆ బాధితురాలు దీనంగా కోర్టును వేడుకుంది. ముంబై శక్తిమిల్స్ ప్రాంతంలో గ్యాంగ్‌రేప్‌కు గురైన 18 ఏళ్ల ఫోటో జర్నలిస్ట్ ఇలా అభ్యర్థించింది. ఈమెని, ఈమెపై దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులను ముంబై సెషన్స్ కోర్టులో బుధవారం హాజరుపరిచినప్పుడు వాళ్లని చూసిన ఆమె ఆగ్రహం పట్టలేకపోయింది.

'నన్ను వాళ్లు ఘోరంగా హింసించారు.. కొట్టారు.. అలాంటివాళ్లను వదలను' అంటూ ఆమె ఆక్రోశించింది. అయితే ఆ రేపిస్టులను కొట్టేందుకు తనను అనుమతించాలన్న బాధితురాలి అభ్యర్థనను సెషన్స్ జడ్జి తోసిపుచ్చారు. శక్తి మిల్స్ ప్రాంతంలోనే ఆగస్టు 22న 22ఏళ్ల మహిళా ఫోటో జర్నలిస్టుపై అత్యాచారం జరిపిన ఐదుగురిలో ముగ్గురిని చూసిన ఆమె అలా కోపోద్రిక్తురాలయింది. ఇటీవల ఆ ఫోటో జర్నలిస్టును కోర్టు విచారిస్తుండగా ఆమె నాటి సంఘటనను వివరిస్తూ కోర్టులోనే స్పృహ తప్పి పడిపోయింది.

Recent Posts