Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బెంగళూరులో 'నువ్వా నేనా..?': భారత్-ఆసీస్ ఏడో వన్డే!

భారత్, ఆసీస్ జట్ల మధ్య ఏడు వన్డేల సిరీస్ చరమాంకానికి చేరుకుంది. శనివారం ఇరుజట్ల మధ్య చివరి వన్డే బెంగళూరులో జరగనుంది. భారత్, ఆసీస్ ఇప్పటి వరకు చెరో రెండు మ్యాచ్‌లు గెలవడంతో సిరీస్ 2-2తో సమమైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో సిరీస్ విజేత ఎవరో తేలనుంది.

తొలి వన్డేలో ఆసీస్ గెలవగా, రెండో వన్డే భారత్ వశమైంది. ఇక, మూడో మ్యాచ్‌లో నెగ్గిన ఆసీస్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం రెండు వన్డేలు వర్షార్పణం కాగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒక్కటి ఓడినా సిరీస్ చేజారుతుందున్న నేపథ్యంలో భారత్ ఆరో వన్డేలో విరుచుకుపడింది. 351 పరుగుల టార్గెట్‌ను ఛేదించి 'సిరీస్' ఆశలను సజీవంగా నిలుపుకుంది.

ఈ నేపథ్యంలో శనివారం జరిగే వన్డేపై ఆసక్తి నెలకొంది. టాస్ మరోసారి కీలకం కానుంది. భారత్ అదే జట్టుతో బరిలో దిగే అవకాశాలున్నాయి. ఇక, పేసర్లు విఫలమవుతుండడం పట్ల ఆసీస్ శిబిరంలో ఆందోళన నెలకొంది. మూడొందల పైచిలుకు స్కోరును కూడా కాపాడుకోలేకపోవడం వారిని కలవరపెడుతోంది.

Recent Posts