Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

పెళ్లి కాకుండానే తండ్రవుతాడట!

హెడ్ లైన్ చదివి కచ్చితంగా సల్మాన్ ఖానే ఈ స్టేట్ మెంట్ ఇచ్చి ఉంటాడని అనుకుంటున్నారు కదూ! కానీ కాదు. ఎంత పెళ్లి చేసుకోను అని సల్మాన్ పదే పదే చెబితే మాత్రం అలా ఫిక్సయిపోతే ఎలా! అతనిలాగే పెళ్లి అనగానే పరుగులు తీసే జీవి బాలీవుడ్ లో ఇంకొకరున్నారు. అతడే...
కరణ్ జోహార్. నలభయ్యేళ్లు దాటినా పెళ్లి ఊసెత్తని ఈ డైరెక్టర్ గారు పెళ్లి అంత అవసరమా జీవితానికి అని అందరినీ ప్రశ్నించి చంపుతుంటాడు. 

అందరి సంగతి ఎందుకు, నీ సంగతి చెప్పు అని ఈ మధ్య ఎవరో అడిగారు. వెంటనే సారు... నాకయితే పెళ్లి అవసరం లేదు అంటూ పళ్లు బయటపెట్టాడు. పెళ్లి నచ్చదు కానీ, పిల్లలంటే మహా ఇష్టమట మన ఏజ్డ్ బ్యాచిలర్ కి. అందుకే ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఎవరు పెంచుతారయ్యా, కష్టం కదా అంటే 'నేనూ మా అమ్మా పెంచుతాం' అంటున్నాడు. నా బిడ్డని బాగా పెంచి, మంచి తండ్రి అనిపించుకుంటాను అంటూ సెంటిమెంట్ డైలాగులు కూడా చెబుతున్నాడు. అతడి మాటలు విన్న కొందరు సన్నిహితులు, ఎలాగైనా అతడిని పెళ్లికి ఒప్పించి తీరాలని కంకణం కట్టుకున్నారట. నీకోసం కాకపోయినా, నీ బిడ్డను పెంచడానికైనా తల్లి కావాలి అనే యాంగిల్ లో ట్రై చేయాలని అనుకుంటున్నారట. మరి మనోడు ఒప్పుకుంటాడో లేదో!

Recent Posts