Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బాలకృష్ణ భవిష్యత్‌ ఏంటి?

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రాజకీయాల్లో డైరెక్ట్‌ ఎంట్రీ ఇస్తారని, ఇకపై సినిమాల్లో తక్కువ నటిస్తారని పరిశ్రమలో ఒక టాక్‌ నడుస్తోంది. అయితే బాలకృష్ణ మాత్రం తన తదుపరి చిత్రం గురించి ఇప్పట్నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న లెజెండ్‌ సినిమా..
వచ్చే ఎన్నికలకి ముందు విడుదల అవుతుందని అంటున్నారు.

 ఆ చిత్రం రిజల్ట్‌తో సంబంధం లేకుండా బాలయ్య తన తదుపరి చిత్రం ఏమిటనే దానిపై దృష్టి పెట్టారు. ఇప్పటికే పలు కథలు కూడా విన్నారు. దీనిని బట్టి చూస్తే ఆయన రాజకీయాల్లో బిజీ కావాలని చూడడం లేదనేది అర్థమవుతోంది. అసలు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా లేక ఇంకా కొంత కాలం సినిమాల్లోనే కొనసాగుతారా అనేది తెలియాల్సి ఉంది. బోయపాటి శ్రీను సినిమా కూడా రాజకీయ నేపథ్యంలో ఉంటుందని మొదట్లో ప్రచారం జరిగినా కానీ అది ఫక్తు మాస్‌ ఎంటర్‌టైనర్‌ అని ఇప్పుడు చెబుతున్నారు.

 దీనిని బట్టి రాజకీయాలపై బాలయ్య అంత ఆసక్తిగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఒకవేళ ఏదైనా నియోజికవర్గం నుంచి పోటీ చేసినా కానీ తెలుగుదేశం పార్టీలో ఆయన కీలక పాత్ర పోషించడానికి సానుకూలంగా ఉన్నట్టు లేరు. కాబోయే సీఎం బాలయ్య అని నినాదాలు చేసే అభిమానులు తమ హీరో అభిమతం ఏమిటనేది తెలియక తికమకపడుతున్నారు.

Recent Posts