Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

జగన్ హిట్టా, ఫట్టా?

జైలు నుంచి బయటకు వచ్చిన జగన్ ఎందుకో పాపం,  ఏది చేసినా సరే ఫట్ మంటోంది. దీక్షలు,నిరసనలు అంతగా కలిసి రాలేదు. సమైక్య తీర్మానం పెడదామంటే సిఎమ్ ససేమిరా అన్నారు. ఇక మిగిలిన ఆఖరి అవకాశం సమైక్య సభ. ఈనెల 26న హైదరాబాద్ లో భారి సమైక్య సభ ను నిర్వహిస్తున్నాడు. ఇది హిట్టయితే ఇక జగన్..
సీమాంధ్రలో తిరుగులేని నాయకుడవుతాడు, అందులో సందేహం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాని ఫెయిలయితే మాత్రం  కోలుకోవడం కష్టం అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.  ఈ సభకు భారీ జనం వస్తేనే ఆయనకు సీమాంద్రలో ఎంట్రీ దొరికినట్టు, లేదంటే జగన్ ను సీమాంద్రలో నమ్మడం లేదన్నది స్పష్టమవుతుంది.  నమ్మడం లేదన్నది నిజం కాకున్నా ఫెయిల్ అయితే ఆ భావాన్ని ప్రత్యర్థులు ప్రజల్లో కల్పిస్తారు, ఇది కూడా జగన్ కు నష్టాన్ని కలిగిస్తుంది. అయితే ఈ సభ విజయవంతం కావడం ఒక్క జగన్ చేతిలో లేదు, సీమాంద్రలోని అన్ని జిల్లాల నేతలు సమిష్టిగా పని చేస్తేనే అవుతుంది. వారు ఎంతవరకు పనిచేస్తారు, సక్సెస్ అవుతారనేది ఇప్పుడు అందరిమదిని తొలుస్తున్న ప్రశ్న. కారణం సభను హైదరాబాద్ లో పెట్టారు.

సీమాంద్రలోని మెజారిటి ప్రాంతాలకు హైదరాబాద్ చాలా దూరం, కేవలం రాయలసీమలోని కర్నూల్, అనంతపూర్ లకు మాత్రమే కాస్తా దగ్గర, కడప కూడా కొంత దూరమే అవుతుంది. ఇక  విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాలు వంటి వాటినుంచి జనం రావడం మాత్రం చాలా కష్టం. ఒకటి దూరాబారం, రెండోది సమయం, అందుకే జన సమీకరణ అంత ఈజీకాదు అన్న భావం వ్యక్తమవుతోంది. మరోటి ఈ సభకు వచ్చిన సీమాంద్రులపై అవసరమైతే భౌతిక దాడులకు దిగుతామని ఓయు జేఏసి హెచ్చరించింది.

పైగా పోలీసుల అభిమతానికి వ్యతిరేకంగా కోర్టు అనుమతి ద్వారా నిర్వహిస్తున్న సభ, అందుకే పోలీసుల మద్దతు కూడా అంతంత మాత్రమే అంటున్నారు. ఇలా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తుండగా, ఇక హైదరాబాద్, రాయలసీమ ప్రాంతాలపైనే జగన్ ఆదారపడాలి. జగన్ కు సీమలో పట్టుఉంది కనుక ఆ విషయంలో డోకా లేదు. ఏది ఏమయినా ఈ సభ మాత్రం జగన్ రాజకీయ జీవితానికి కీలకం కానుందన్నది మాత్రం వాస్తవం, అందుకే అందరి చూపు ఆ సభపై కేంద్రీకృతమైంది.

Recent Posts