Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

వీళ్లకి టిక్కెట్లెలా?

విభజన సంగతి పక్కనపెడితే, రాబోయే ఎన్నిక్లలో కొంత మందికి ఏ పార్టీ టిక్కెట్లు లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఈ జాబితాలో ప్రస్తుతానికి విజయవాడ ఎంపీ లగడపాటి, అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, అమలాపురం ఎంపీ హర్షకుమార్ తదితరులు వున్నారు. .వీరంతా అధిష్టానంపై వీలయినంతగా నిప్పులు చెరగడం, ధిక్కరించడం వంటి వ్యవహారాలకు పాల్పడ్డారు. అలాగే కంటిన్యూ అవుతున్నారు. 

లగడపాటి స్పీకర్ ను తరచు ధిక్కరిస్తూ అదే పనిగా చికాకు పెడుతున్నారు సబ్బం హరి నిన్న మొన్నటి దాకా వైకాపా తరపున పోటీ చేస్తానని, కాంగ్రెస్ వేరే అభ్యర్థిని చూసుకోవచ్చని తెగేసి చెప్పేసారు. హర్షకుమార్ ఏకంగా తరచు సోనియాపై విమర్శలు కురిపించారు. మరికొంత మంది ఇలాంటి వారు వున్నా అంత తీవ్రత లేదు. సో, ఈ ముగ్గురూ విజయవాశాలు ఎలా వున్నా కాంగ్రెస్ టిక్కెట్ ఆశించడం అయితే మామూలే. కానీ ఇస్తారా అన్నది అనుమానం. పోనీ వైకాపాలోకి దూకేద్దామా అంటే అక్కడ సీట్లన్నీ ఇప్పటికే రిజర్వు అయిపోయాయని వినికిడి. విజయవాడ నుంచి పివిపి ప్రసాద్, అనకాపల్లి నుంచి దాడి వీరభద్రరావు లేదా కొణతాల పేర్లు వినిపిస్తున్నాయి. హర్షకుమార్ వైకాపాలోకి వెళ్లే పరిస్థితే లేదు. అందుకే వీరు, ఇలాంటి మరి కొందరు కొత్త పార్టీ ఏది వస్తుందా అని చూస్తున్నారు. సబ్బం హరి, హర్షకుమార్ లాంటి వాళ్లు పైకి మాట్లాడకున్నా, లగడపాటి లాంటి వాళ్లు ఆ ఆలోచనల్లోనే వున్నారు. కిరణ్ పార్టీ కనుక పెడితే వీరికి కాస్త ఊరట. సబ్బం హరి మాత్రం తనకు కెవిపి రామచంద్రరావు ఎలాగైనా వైకాపా టికెట్ ఇప్పిస్తారన్న ఆశతో వున్నారు. గతంలో కాంగ్రెస్ కు దూరమైతే, వైఎస్ కు చెప్పి అనకాపల్లి టికెట్ ఇప్పించింది ఆయనే. మళ్లీ అందుకే ఆయనపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి టికెట్, పార్టీ సమస్యలతో కిందా మీదా పడుతున్న వారు చాలా మందే వున్నారు మరి. వారి కోసమైనా ఎవరో ఒకరు ఓ పార్టీ పెట్టాలి .విభజన సంగతి పక్కనపెడితే, రాబోయే ఎన్నిక్లలో కొంత మందికి ఏ పార్టీ టిక్కెట్లు లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఈ జాబితాలో ప్రస్తుతానికి విజయవాడ ఎంపీ లగడపాటి, అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, అమలాపురం ఎంపీ హర్షకుమార్ తదితరులు వున్నారు. వీరంతా అధిష్టానంపై వీలయినంతగా నిప్పులు చెరగడం, ధిక్కరించడం వంటి వ్యవహారాలకు పాల్పడ్డారు. అలాగే కంటిన్యూ అవుతున్నారు. 


లగడపాటి స్పీకర్ ను తరచు ధిక్కరిస్తూ అదే పనిగా చికాకు పెడుతున్నారు సబ్బం హరి నిన్న మొన్నటి దాకా వైకాపా తరపున పోటీ చేస్తానని, కాంగ్రెస్ వేరే అభ్యర్థిని చూసుకోవచ్చని తెగేసి చెప్పేసారు. హర్షకుమార్ ఏకంగా తరచు సోనియాపై విమర్శలు కురిపించారు. మరికొంత మంది ఇలాంటి వారు వున్నా అంత తీవ్రత లేదు. సో, ఈ ముగ్గురూ విజయవాశాలు ఎలా వున్నా కాంగ్రెస్ టిక్కెట్ ఆశించడం అయితే మామూలే. కానీ ఇస్తారా అన్నది అనుమానం. పోనీ వైకాపాలోకి దూకేద్దామా అంటే అక్కడ సీట్లన్నీ ఇప్పటికే రిజర్వు అయిపోయాయని వినికిడి. విజయవాడ నుంచి పివిపి ప్రసాద్, అనకాపల్లి నుంచి దాడి వీరభద్రరావు లేదా కొణతాల పేర్లు వినిపిస్తున్నాయి. హర్షకుమార్ వైకాపాలోకి వెళ్లే పరిస్థితే లేదు. అందుకే వీరు, ఇలాంటి మరి కొందరు కొత్త పార్టీ ఏది వస్తుందా అని చూస్తున్నారు. సబ్బం హరి, హర్షకుమార్ లాంటి వాళ్లు పైకి మాట్లాడకున్నా, లగడపాటి లాంటి వాళ్లు ఆ ఆలోచనల్లోనే వున్నారు. కిరణ్ పార్టీ కనుక పెడితే వీరికి కాస్త ఊరట. సబ్బం హరి మాత్రం తనకు కెవిపి రామచంద్రరావు ఎలాగైనా వైకాపా టికెట్ ఇప్పిస్తారన్న ఆశతో వున్నారు. గతంలో కాంగ్రెస్ కు దూరమైతే, వైఎస్ కు చెప్పి అనకాపల్లి టికెట్ ఇప్పించింది ఆయనే. మళ్లీ అందుకే ఆయనపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి టికెట్, పార్టీ సమస్యలతో కిందా మీదా పడుతున్న వారు చాలా మందే వున్నారు మరి. వారి కోసమైనా ఎవరో ఒకరు ఓ పార్టీ పెట్టాలి .

Recent Posts