Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ దూకుతాడా?

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు విశేషమైన అభిమాన సంపద ఉంది. ప్రత్యేకంగా పవనిజం అంటూ ఆయన గురించి మాట్లాడుతున్నారు. అదేమిటో తనకు తెలియదని, అయితే సామాజిక సేవకు సంబంధించింది అయి ఉంటుందని పవన్ కళ్యాణ్ ఇటీవల అన్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాలు అనూహ్యంగా వరుస విజయాలు సాధిస్తున్నాయి. తొలుత గబ్బర్ సింగ్, ఆ తర్వాత అత్తారింటికి దారేది విజయం సాధించాయి. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగు పెడుతారా అనే చర్చ సాగుతోంది.అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు ఆ పార్టీ యువజన విభాగం నేతగా రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించడానికి ప్రయత్నించారు. కాంగ్రెసు నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, 2009లో ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో ఘోరం విఫలమైన తర్వాత చిరంజీవి వెనక్కి తగ్గారు. తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారు. రాజ్యసభ్యుడైపోయి మంత్రి పదవిని కూడా చేపట్టారు. అయితే, ఇది పవన్ కళ్యాణ్కు ఏ మాత్రం ఇష్టం లేదని అంటున్నారురాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ దూకుతాడా?" "రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ దూకుతాడా?చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం ఇష్టం లేని పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరమైపోయి, సినిమాలపై దృష్టి పెట్టారు. సినిమాలు విజయం సాధిస్తుండడంతో ఆయన టాలీవుడ్లో నిత్యం చర్చనీయాంశంగా మారారు. పవన్ నిత్యం చర్చ జరగడానికి మరో కారణం కూడా ఉంది. ఏదీ లోపల దాచుకోకుండా ఉన్నదున్నట్లు మాట్లాడడం, ఉద్వేగానికి గురి కావడం అందుకు మరో కారణం. ఇటీవల అత్తారింటికి దారేది సినిమా కార్యక్రమంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.ఆ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే దాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. దాంతో ఓ మహిళ తన సమస్యతో ఆయన వద్దకు వెళ్లింది. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడానికి దాన్ని ఏర్పాటు చేయలేదని అప్పట్లో చెప్పారు. ఆ తర్వాత దాని గురించి పెద్దగా ప్రస్తావన లేకుండా పోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సంబంధించి ఏమైనా చేయదలుచుకుంటున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది.

Recent Posts