Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

అందరికీ.. : ఇషాంత్‌కు ఫాల్కనర్ ఓదార్పు..





మొహాలీ: మూడో వన్డేలో ఇషాంత్ శర్మకు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్కనర్ అతనికి ఓదార్పు మాటలు చెప్పాడు. "ఇషాంత్... బాధపడకు. ప్రతి బౌలర్‌కూ ఇలాటి పరిస్థితి ఎదురవుతుంది. ఆఖరి ఓవరులో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో బౌలింగు చేయడం కష్టం. చాలా సార్లు ఒత్తిడిలోనూ పొదుపుగా బౌలింగ్ చేసి భారత్‌ను గెలిపించావు" అని ఫాల్కనర్ అన్నాడు. మొహాలీలో జరిగిన మూడో వన్డేలో ఫాల్కనర్ ఇషాంత్ వేసిన 47వ ఓవరులో 30 పరుగులు రాబట్టి తన జట్టుకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో ఫాల్కనర్ 29 బంతుల్లో 64 పరుగులు చేశాడు. తాను కూడా ఇషాంత్ శర్మ ఎదుర్కున్న పరిస్థితిని ఎదుర్కున్నానని అన్నాడు. అశ్విన్ బౌలింగులో తాను బౌండరీలు సాధించడం కష్టమని భావించానని, దాంతో గెలవాలంటే పేసర్ల బౌలింగులోనే పరుగులు పిండుకోవాలని అనుకున్నానని, ప్రతి ఓవరుకు 20 పరుగులు రాబట్టాలని భావించానని చెప్పాడు. రెండో వన్డేలో భారత్ భారీ లక్ష్యాన్ని ఛేదించిందని, 360 పరుగుల టార్గెట్‌ను భారత్ ఛేదించడం తమను అసంతృప్తికి గురి చేసిందని అన్నాడు. దాంతో తాము తిరిగి పుంజుకోవాల్సి ఉందని భావించామని, మూడో వన్డేలో గెలిచామని ఫాల్కనర్ అన్నాడు. తదుపరి నాలుగు వన్డేల్లో కఠినమైన పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

Recent Posts