Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

అగస్టా స్కామ్‌తో లింక్: షర్మిల భర్త అనిల్‌పై బిజెపి ఫైర్





హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్‌పై భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు ఎస్‌విఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అగస్టా హెలికాఫ్టర్ కుంభకోణంలో బ్రదర్ అనిల్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. స్విట్జార్‌లాండ్‌లో అరస్టయిన హాష్కీని భారత్‌కు రప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అనిల్, దళారి హాష్కీని ముఖాముఖి విచారణ జరపాలని, అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు.హెలికాఫ్టర్ కొనుగోలు విషయంలో ప్రభుత్వాధికారి రమాకాంత్ రెడ్డి ఇటలీకి నాలుగు సార్లు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన అడిగారు. కాంగ్రెస్ పెద్దలకు వైయస్సార్ కాంగ్రెసు పా్రటీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ముడుపులు అందిన విషయం బయటపడుతుందనే సీబీఐ క్విడ్‌ప్రొకో జరగలేదని అంటోందని ప్రభాకర్ ఘాటుగా విమర్శించారు. బ్రదర్ అనిల్ కుమార్ బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌పై కూడా ఆయన తీవ్ర ఆరోపణ చేశాడు.

Recent Posts