Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

వాస్తవానికి పవన్ దూసుకెళ్లాలి, కానీ...!





హైదరాబాద్: మంచు విష్ణు హీరోగా, వీరూ పోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘దూసుకెళ్తా' మూవీ నిన్న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు వీరూ పోట్ల ఈ చిత్రాన్ని తొలుత పవన్ కళ్యాణ్‍‌తో చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల పవన్ ఆ సినిమా చేయడానికి నో చెప్పాడట.
స్క్రీన్ రైటర్‌గా కెరీర్ మొదలు పెట్టిన వీరూ పోట్ల...మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘బిందాస్' చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత నాగార్జునతో తీసిని ‘రగడ' చిత్రం కూడా హిట్ కావడంతో....పవన్ కళ్యాణ్ కోసం ‘దూసుకెళ్తా' స్క్రిప్టు రెడీ చేసుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ నో చెప్పడంతో వేరే హీరో కోసం ప్రయత్నాలు మొదలు పెట్టి చివరకు మంచు విష్ణుతో ఆ సినిమా పూర్తి చేసాడట. పవన్ కళ్యాణ్ ఆ కథ రిజెక్ట్ చేయడం మంచు విష్ణుకు కలిసొచ్చిందని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. పవన్ రిజెక్ట్ చేసిన సినిమాల వల్ల ఇతర హీరోలు లాభ పడ్డ సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయనే వాదన ఉంది. పూరి-రవితేజ కాంబినేషన్లో వచ్చిన పలు చిత్రాలు పవర్ స్టార్ కోసం రెడీ చేసినవేనంట. మరి ఈ ప్రచారంలో నిజం ఎంతో..?

Recent Posts