Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

కాంగ్రెస్‌కు కలిసి రాని తెలంగాణ : టైమ్స్ నౌ సీ ఓటర్ సర్వే





2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంకానుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఒక ప్రాంతంలో లబ్ధి పొందాలని భావించిన కాంగ్రెస్‌కు అది అందని ద్రాక్షలానే మారనుంది.


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం అనుకూలించదని ఇండియా టీవీ-టైమ్స్ నౌ సీ ఓటర్ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో భాగా దెబ్బతింటుందని ఈ సర్వే పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో సీమాంధ్రలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ చెరో 13 ఎంపీ సీట్లను గెలుచుకుంటాయని సర్వేలో వెల్లడైంది.


ఇక కాంగ్రెస్‌కు రాష్ట్రం‌లో కేవలం 7 నుంచి 5 సీట్లు మాత్రమే దక్కుతాయని, ఈ సీట్లు కూడా తెలంగాణ ప్రాంతంలోనే రావొచ్చని అంచనా వేసింది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ 8 స్థానాలతో సరిపెట్టుకోనుంది.


ఇక కేంద్రం విషయానికి వస్తే యూపీఏ కన్నా ఎన్డీయేనే ముందంజలో ఉన్నట్లు తేలింది. ఏపీతో పాటు, యూపీ, రాజస్థాన్, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని, ఉత్తరప్రదేశ్, బీహార్‌లో బీజేపీ బాగా రాణిస్తుందని సర్వే ఫలితాలు వెల్లడించింది.

Recent Posts