Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు ఆమోదిస్తే యూపీఏ-2 ఔట్!


సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు ఆమోదిస్తే కేంద్రంలోని యూపీఏ-2 ప్రభుత్వం కుప్పకూలి పోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఎంపీల రాజీనామాలపై ఆమోదముద్ర స్పీకర్ వేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ అడ్డు తగులుతోందని అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సీమాంధ్ర ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తే యూపీఏ ప్రభుత్వ సంఖ్యా బలం 213 (సాధారణ మెజార్టీ 272)కు పడిపోతుంది. అపుడు ప్రభుత్వమే మైనార్టీలో పడిపోతుంది. దీనికితోడు రాష్ట్ర విభజనను యూపీఏకు బయట నుంచి మద్దతునిస్తున్న ఎస్పీ వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఎంపీల రాజీనామాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఆచితూచి స్పందిస్తోంది. 

అదేసమయంలో కేంద్ర మంత్రులను తన దారికి తెచ్చుకున్నట్టుగానే ఎంపీలను కూడా నయానో భయానో దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలను అస్త్రాలుగా ప్రయోగిస్తోంది. 

అదేసమయంలో దూకుడు ప్రదర్శిస్తున్న విజయవాడ ఎంపీ లగడపాటిని ఒంటరిని చేసేందుకు అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన ఎంపీలు మెత్తబడతారా లేక కాంగ్రెస్ హైకమాండ్‌పై ధిక్కార స్వరం వినిపిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.

Recent Posts