Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సన్నీలియోన్‌కు అది నచ్చలేదట... స్వయంగా చేస్తాదట





మాజీ పోర్న్‌స్టార్ సన్నీలియోన్‌కు ఓ విషయం అసలు నచ్చలేదట. ఇంతకీ ఆ విషయం ఏమిటనుకుంటున్నారు. తాజాగా ఓ సినిమా షూటింగ్‌లో కొన్ని సన్నివేశాలను డూప్‌తో చేయించాలని అనుకోగా సన్నీ దానికి తీవ్రంగా ఖండించిందట. డూప్‌లు వద్దని, తనే స్వయంగా చేస్తానని ఖరాఖండీగా చెప్పేసిందట.




ఇంతకి అసలు అది ఏ విషయమో చెప్పనేలేదు కదూ! ప్రస్తుతం రాగిణి ఎమ్మెమ్మెస్ సినిమా పూర్తి చేసిన సన్నీ ప్రస్తుతం తన అప్‌క‌మింగ్ మూవీ 'టినా అండ్ లోలో' కోసం పనిచేస్తుంది. ఇది పూర్తిగా సన్నీ మార్క్ ఉన్న యాక్షన్ మూవీ. ఈ మూవీలో స‌న్నీలియోన్ యాక్షన్ స్టంట్స్‌తో అల‌రించ‌డానికి రెడీ అయ్యింది. అయితే స‌న్నీలియోన్ యాక్షన్ స్టంట్స్ చేయాలంటే క‌ష్టమే అనుకొని డూప్‌తో చేపిస్తామని చిత్ర నిర్వాహ‌కులు డూప్‌లను కూడా పిలిపించారట.




అంతే దాంతో కోపమొచ్చిన స‌న్నీలియోన్ నిర్మాత‌ల‌కు నాకు ఎటువంటి డూప్ అవ‌స‌రంలేదు. యాక్షన్ స్టంట్స్ నాకు కొత్తేమి కాదు. నాకు డూప్ అవ‌స‌రం లేదంటూ ఘాటుగా చెప్పిందట. ఈ సినిమా కోసమే స‌న్నీలియోన్ గ‌న్ షూటింగ్‌, బాక్సింగ్ ట్రైనింగ్ వంటి వాటిల్లో ట్రైనింగ్ కూడా తీసుకుంది. అందుకే ఇక ఏదైనా డూప్ లేకుండా చేయాలని డిసైడ్ అయిందట సన్నీ!

Recent Posts