Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

జేసీ వర్సెస్ బొత్స : కంపు కొడుతున్నా కాంగ్రెస్‌లోనే ఉన్నా!

పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డిల మధ్య మాటలయుద్ధం రాజుకుంది. దత్తపుత్రుడు జగన్ మోహన్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందంటూ జేసీ ఇటీవల చేసిన ఘాటు వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ ఒకింత ఘాటుగానే వ్యాఖ్యానించారు.

సోమవారం ఉదయం విజయనగరం వరద బాధిత ప్రాంతాల పర్యటనలో ఉన్న బొత్సకు జేసీ దివాకర్ రెడ్డి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా వారి మధ్య మాటలయుద్ధం చోటు చేసుకున్నట్టు సమాచారం.

సీనియర్లుగా ఉన్న నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ వంటి వ్యాఖ్యలు మాట్లాడటం కంటే పార్టీని వీడొచ్చు కదా అంటూ బొత్స అనడంతో ఆగ్రహించిన జేసీ ధీటుగానే సమాధానం చెప్పారు. తాము పుట్టింది కాంగ్రెస్‌లో.. పెరిగింది కాంగ్రెస్ పార్టీలో. చచ్చి కంపు కొడుతున్నా పార్టీలోనే కొనసాగుతున్నామని బొత్సకు జేసీ స్పష్టం చేశారు.

Recent Posts