Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మహేష్ ‘ఆగడు’...





హైదరాబాద్: టాలీవుడ్ రియల్ స్టార్ శ్రీహరి హఠాన్మరణం ఎంతో మందిని కలిచి వేసింది. శ్రీహరి మరణంతో ఇండస్ట్రీలో తీరని లోటు ఏర్పడింది. ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, పవర్‌ఫుల్ యాక్టింగుతో శ్రీహరి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీహరిని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన పాత్రలకు ఎవరిని తీసుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఢీ, కింగ్, బృందావనం లాంటి సినిమాల్లో శ్రీహరి స్థానంలో మరెవరినీ ఊహించుకోలేం. తన సినిమాల్లో ఇప్పటి వరకు శ్రీహరి కోసం ప్రత్యేకమైన పాత్రలు డిజైన్ చేసిన దర్శకుడు శ్రీను వైట్ల....త్వరలో మహేష్ బాబుతో చేయబోయే ‘ఆగడు' చిత్రంలో కూడా ఓ పాత్రను డిజైన్ చేసాడు. అయితే శ్రీహరి హఠాన్మరణంతో శ్రీను వైట్ల అయోమయంలో పడ్డారు. ఈ సంఘటనతో ‘ఆగడు' సినిమా షూటింగు ప్రారంబోత్సవాన్ని కూడా ఆయన వాయిదా వేసారు. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం శ్రీహరి కోసం తయారు చేసిన పాత్రలోకి నటుడు సాయికుమార్‌ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట శ్రీను వైట్ల. శ్రీను వైట్ల ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి చేసారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. త్వరలో ప్రారంభోత్సవం జరుగనుంది. అదే రోజే ఈ సినిమాకు సంబంధించిన కథనాయికలు, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న 1(నేనొక్కడినే) సినిమాతో పాటు ‘ఆగడు' సినిమా కూడా 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ యే నిర్మిస్తుం

Recent Posts