Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

అమితాబ్‌‌పై చేయి చేసుకుంది, ఎంత ధైర్యం?





ముంబై: ఇండియన్ సినిమా పరిశ్రమలోని లెజెండ్‌లలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒకరు. ఆయనంటే అందరికీ ఎంతో గౌరవం. మరి అలాంటి వ్యక్తిపై చేయి చేసుకునే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? కానీ అలాంటి సంఘటన జరిగింది. అయితే అమితాబ్ ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు. అయితే ఇక్కడ ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆ చర్యకు పాల్పడింది ఓ కోతి. పాపం దానికేం తెలుసు? ఈయనో పెద్ద స్టార్ అని! చాలా ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి బిగ్ బి తాజాగా గుర్తు చేసుకున్నారు. హరిద్వార్‌లో ‘గంగా కి సౌగంధ్' సినిమా షూటింగులో తన కోస్టార్ రేఖతో కలిసి ఉన్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందట. ఆయన తన ఫేస్‌బుక్ పేజీలో ఈ విషయం గురించి వెల్లడిస్తూ....‘షూటింగ్ అయిపోయాక హరిద్వార్ లోని హోటల్‌కు తిరిగి వెలుతున్నాం. రోడ్డుపై మేము కొన్ని కోతులను చూసాం. వాటిని లంగూర్స్ అని పిలుస్తారు. వాటికి ఏనుగు కంటే పవర్ ఫుల్‌గా ఉండే పొడవైన తోక ఉంటుంది. అవి వీధుల్లో ఆహారం కోసం అన్వేషిస్తున్నాయి. మేము కారు ఆపగానే అవి మా వద్దకు వచ్చాయి' అని తెలిపారు అమితాబ్. అమితాబ్ బచ్చన్ దీంతో మా వద్ద ఉన్న కొన్ని అరటి పండ్లు, ఇతర పదార్థాలు వాటికి ఇవ్వడం మొదలు పెట్టాను. ఇంతలో ఒక కోతి వచ్చి తనకు ఇవ్వడం లేదనే కోపంతో నన్ను కొట్టింది...అని అమితాబ్ గుర్తు చేసుకున్నారు. కోతులకు ఆహారం పంచుతున్న ఫోటోను కూడా అమితాబ్ పోస్టు చేసాడు. ఈ చిత్రంలో అమితాబ్ తో పాటు ఉన్న వ్యక్తి దీపిక్ సావంత్. గత 35 ఏళ్లుగా ఆయన అమితాబ్‌కు సహాయకుడిగా ఉంటున్నారు.

Recent Posts