Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

అన‌సూయ ప‌వ‌న్‌ని టార్గెట్ చేసిందా??





అన‌సూయ మామూలమ్మాయి కాదు. అబ్బో.. భ‌లే టాలెంట్ చూపిస్తోంది. ‘జ‌బ‌ర్దస్త్’ టీవీషోతో కాస్త క్రేజ్ వ‌చ్చిందో లేదో, దాన్ని ఎలా వాడుకోవాలి..?? అనే దానిపై తీవ్రస్థాయిలో దృష్టి పెట్టింది. అందుకే ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని టార్గెట్ చేసింది. ‘జ‌బ‌ర్ ద‌స్త్’ షో జ‌రుగుతున్నంత‌సేపూ అన‌సూయ వార్తల్లో నిలిచేది. ‘అత్తారింటికి దారేది’ లో ఐటెమ్ పాట ఆఫ‌ర్ వ‌చ్చిందంటే అది ‘జ‌బ‌ర్దస్త్’ పుణ్యమే. ప‌వ‌న్ సినిమాలో ఆఫ‌ర్ రావ‌డంతో ఎంత పాపుల‌ర్ అయ్యిందో, ఆ ఆఫ‌ర్ ని వ‌దులుకొని కూడా అంతే పాపుల‌ర్ అయ్యింది. అయితే ఆ ‘జ‌బ‌ర్దస్త్’ నుంచి త‌ప్పుకోవ‌డంతో అన‌సూయ క్రేజ్ త‌గ్గుతూ వ‌చ్చింది. ఇప్పుడామెను ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశారు. మ‌ళ్లీ ఎలాగోలా వార్తల్లో నిల‌వాల‌ని ప‌వ‌న్‌ని టార్గెట్ చేసింది. ఈ మ‌ధ్య అన‌సూయ ట్విట్టర్ లో అత్తారింటికి దారేది సినిమాపై కొన్ని కామెంట్లు పెట్టింది. ”ఈ సినిమా ఎందుకు ఒప్పుకోలేద‌ని అడిగారు, న‌న్ను దోషిని చూసిన‌ట్టు చూశారు. ఒప్పుకొని ఏం లాభం? గుంపులో గొవింద‌మ్మలా క‌నిపించేదాన్ని అంతే. వ‌దులుకొని మంచిప‌నిచేశా..” అంటోంది. ఇలాంటి కామెంట్లతో మీడియా దృష్టిని ఆక‌ర్షించాల‌నో, ఏమో మ‌రి. ప‌వ‌న్‌తో పెట్టుకొంటే ప్రచారం తేలిగ్గా జ‌రిగిపోతుంది అనుకొంటుందో ఏమో..? దీని రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో కాల‌మే చెప్పాలి.

Recent Posts