Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఇక నెం.1 ప‌వ‌న్ క‌ల్యాణే





అత్తారికింటికి దారేది సినిమా రికార్డుల దారులు వెతుక్కొంటూ సాగిపోతోంది. కుటుంబ ప్రేక్ష‌కులు ఇప్పుడిప్పుడే సినిమాకి త‌ర‌లి వ‌స్తున్నారు. దాంతో వ‌సూళ్లు మూడో వారంలోనూ నిల‌క‌డ‌గా సాగుతున్నాయి. దాదాపు 60 నుంచి 70 శాతం థియేట‌ర్లు నిండుతున్నాయి. వ‌సూళ్లు ఇంకా వ‌స్తూనే ఉన్నాయి. దాంతో మ‌గ‌ధీర కి వ‌ణుకు పుడుతోంది. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కూ టాలీవుడ్‌లో నెం.1 సినిమా (వ‌సూళ్ల ప‌రంగా) మ‌గ‌ధీర‌నే. ఆ సినిమా దాదాపు రూ75 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. దానికి ప‌వ‌న్ సినిమా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసింది. మ‌రో ప‌ది రోజులు ఈ వ‌సూళ్లు కొన‌సాగించా.. మ‌గ‌ధీర‌ను దాటేసే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. పైగా మ‌గ‌ధీర శ‌త‌దినోత్స‌వాలు జ‌రుపుకొన్న చిత్రం. వంద రోజులు ఆడితే గానీ.. రూ.75 కోట్లు సాధించ‌లేదు. అత్తారింటికి అలా కాదు. తొలి మూడు వారాల్లోనే మ‌గ‌ధీర రికార్డుకు చేరువ‌లో వ‌చ్చేసింది. ఇంత వ‌ర‌కూ వ‌సూళ్ల‌లో నేనే నెం.1 హీరో అని పోజులు కొట్టిన రామ్‌చ‌ర‌ణ్ ఇక రెండో స్థానానికి ప‌డిపోక త‌ప్ప‌దు. మ‌గ‌ధీర‌.. మ‌గ‌ధీర అంటూ రాజ‌మౌళి రికార్డుల్ని ప‌దే ప‌దే గుర్తు చేసుకొనే జనం.. ఇక మీద‌ట ప‌వ‌న్ సినిమా గురించి చెప్పుకోవ‌ల‌సిందే. వెల్ డ‌న్ ప‌వ‌న్‌!!

Recent Posts