Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుడ్డోడిని ముంచేశారు!




‘రామ‌య్యా వ‌స్తావ‌య్యా’ రిలీజ్‌కు ముందు నిర్మాత‌ దిల్ రాజు తెగ ధీమాలో ఉన్నాడు. ”ఈ సినిమా నే చూశా. సూప‌ర్ హిట్ట్‌. నా సినిమా గురించి నేనెప్పుడూ ఇలా చెప్పుకోలేదు. ఈ సినిమా గురించి ఎంతైనా ఊహించుకోవ‌చ్చు, అవ‌న్నీ సినిమాలో ఉన్నాయ్‌ ”- అని ఓ భారీ స్టేట్ మెంట్ ఇచ్చాడు. పిచ్చి అభిమానులు నిజ‌మేకామోసు అనుకొన్నారు. పైగా హ‌రీష్ శంక‌ర్ మామూలోడా..? ఇక చూసుకోక్క‌ర్లేదు – ఈ దెబ్బ‌కు రికార్డుల‌న్నీ గ‌ల్లంతైపోవాలి అన్నాడు. చోటా కె.నాయుడు ”అస‌లు ఇలాంటి డైరెక్ట‌ర్‌ని చూళ్లేదు. సినిమా భ‌లే ఎంజాయ్ చేశ” అన్నాడు. ఆడియో ఫంక్ష‌న్లో రావు ర‌మేష్ తో స‌హా ప్ర‌తి ఒక్క‌రూ ఆహా.. ఓహో అన్నారు. అస‌లే ఎన్టీఆర్ సినిమా అంటే ఓ రేంజ్లో అంచ‌నాలు ఉంటాయి. ఈ మాట‌ల‌తో అవి మ‌రింత పెరిగిపోయాయి. ఎన్టీఆర్ మాట్లాడ్డానికి ఏమీ మిగ‌ల్లేదిక‌. వీళ్లంతా క‌ల‌సి ఎన్టీఆర్‌ని నిలువునా ముంచేశారు.
ఇప్పుడు ఎన్టీఆర్ మాటల్లేవు. ప్లాటిన‌మ్ డిస్క్ ఫంక్ష‌న్లు లేవు, స‌క్సెస్ మీటుల్లేవు. ఎన్టీఆర్ సినిమాకి ఉండాల్సిన సంద‌డి అస్స‌లే లేదు. ఎందుకంటే సినిమా ప‌లితం అలా ఉంది మ‌రి. ఇది వ‌ర‌కు ఎప్పుడూ లేనంత నిరాశ నిస్పృహ‌లో ఉన్నాడు ఎన్టీఆర్‌. ఎంత ఫ్లాప్ ఎదురొచ్చినా – గుండె నిబ్బ‌రంతో ఉండే తార‌క్ ఈసారి ఆచూకీ లేడు. రామ‌య్య టీమ్‌కి అస్స‌లు అందుబాటులో లేడ‌ట‌. అంద‌రూ క‌ల‌సి.. ఓ ఫ్లాప్ సినిమాలో ఇరికించేశార‌ని తెగ ఫీల‌వుతున్నాడ‌ట‌. ఈ సినిమా రిజ‌ల్ట్ తెలిసిన వెంట‌నే హ‌రీష్ శంక‌ర్‌ని నానా చివాట్లు పెట్టాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపించాయి. క్లాస్ పీక‌డంలో త‌ప్పులేదు. ఎందుకంటే ఈ సినిమా ప‌రాజ‌యానికి అంద‌రూ ద‌ర్శ‌కుడినే బాధ్యుడిని చేస్తున్నారు. ఓ స్టార్ ఇమేజ్ ఉన్న క‌థానాయ‌కుడిని… ఎలాంటి పాత్ర‌లో అయినా ఇమిడిపోయే న‌టుడిని.. స‌రిగా ఉప‌యోగించుకోలేద‌నేది విశ్లేష‌కుల మాట‌. దిల్ రాజు కూడా మ‌రీ ఓవ‌ర్ కాన్పిడెన్స్‌కి పోయి… క‌థ‌, స్ర్కిప్ట్ ల‌ను అస్సలు ప‌ట్టించుకోలేద‌ని.. దాంతో హ‌రీష్ త‌న ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఈ సినిమాని తీసుకొని పోయాడ‌ని చెప్పుకొంటున్నారు. ఏదేతైనేం.. అంద‌రూ క‌ల‌సి బుడ్డోడిని ముంచేశారు. చేతులు కాలిపోయాక‌.. బ‌ర్నాల్ రాసుకొంటే ఏం లాభం??

Recent Posts