Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మల్లికా షెరావత్‌ హర్టయింది, అతను ఏమన్నాడు?





ముంబై: తన హాట్ అండ్ సెక్సీ అందాల ప్రదర్శనతో బాలీవుడ్ సెక్స్ బాంబ్‌గా పేరు తెచ్చుకున్న మల్లికా షెరావత్ సినిమా అవకాశాలు తగ్గడంతో బుల్లితెర వైపు తన దృష్టి మళ్లించిన సంగతి తెలిసిందే. ‘బ్యాచిలరెట్ ఇండియా-మేరే ఖయాలోంకి మల్లికా' పేరుతో ‘లైఫ్ ఓకే' ఛానల్‌లో రియాల్టీ షో ప్రారంభించింది. కాగా ఈ షో షూటింగ్ ఉన్నట్టుండి ఆగి పోయింది. ఈ షోలో మల్లికకు తగిన జోడీ అనిపించుకునేందుకు పోటీ పడుతున్న వ్యక్తుల్లో ఒకరు....ఆమెతో బ్యాడ్‌గా మాట్లాడటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో హర్టయిన మల్లికా వెంటనే షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లి పోయింది. దీంతో మూడు రోజుల పాటు షూటింగ్ నిలిపివేయాలని నిర్ణయించారు. మరి మల్లిక అంత ఫీలయ్యేలా అతను ఏం మాట్లాడాడు? అనేది చర్చనీయాంశం అయింది. మల్లికా షెరావత్ ఈ రియాల్టీ షో వివరాల్లోకి వెళితే....తన లైఫ్‌కు 'మిస్టర్‌రైట్‌'ను వెతుక్కోవడంలో భాగమే ఈ రియాల్టీ షో ఉద్దేశ్యమని మల్లిక గతంలో చెప్పుకొచ్చంది. అమెరికన్‌ టీవీలో ప్రసారమైన 'ది బ్యాచులర్‌' షో ఆధారంగా దీనిని తీస్తున్నారు. ఎవరితో డేటింగ్‌ చేయాలనే విషయమై తనకు కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయని మల్లిక అంటోంది. 'మంచి చదువు, సంస్కారంతో పాటు స్వయంకృషితో ఎదిగిన వాడు కావాలి. అతను ప్రేమికుడే కాదు స్నేహి తుడూ అవుతాడు' అంటూ ఈ 36 ఏళ్ల అందాలరాశి చెప్పింది. మనసులో ఉన్నది నిర్భయంగా మాట్లాడేవాడు. నష్టాలకు సిద్ధపడే మగవాళ్లను మల్లిక ఇష్టపడు తుందట. ఈ షో ద్వారా తాను అన్వేషిస్తున్న నిజమైన మగవాడు దొరకుతాడనే నమ్మకం ఉందని తెలిపింది.

Recent Posts