ఈ వారం తెలుగు టీవీ ఛానెల్స్ లో టాప్ ఏది?

హైదరాబాద్ : తెలుగు న్యూస్ ఛానెల్స్ ఒక దానికొకటి పోటీ పడుతూ టీఆర్పీ రేటింగులు పెంచుకుంటూంటాయి. ముఖ్యంగా న్యూస్ ఛానెల్స్ లో ఈ పోటీ మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఇంటిలో కనీసం ఒక టీవీ. ఎవరు ఏ చానెల్ చూస్తున్నారో, ఎవరు ఏ కార్యక్రమం అంటే ఇష్టపడుతున్నారో అనేది ఈ రేటింగ్ లు ద్వారా తెలుస్తాయి. ఈ రేటింగ్ లను టామ్ ఇస్తూంటుంది. టామ్ అంటే మరేమీ కాదు, టెలివిజన్ ఆడియన్స్ మెజర్‌మెంట్. ఈ వారం టామ్ సంస్ధ ఇచ్చిన వారాంతపు రేటింగ్స్ (అక్టోబర్ 14 వరకూ) ని బట్టి చూస్తే... టీవి 9 ఛానెల్ నెంబర్ వన్ ప్లేసులో ఉంది. 161 జీఆర్పీలు ఈ వారాంతానికి నమోదు చేసింది. గత కొంత కాలంగా నెంబర్ వన్ ప్లేసులో ఉంటూ వస్తున్న టీవీ 5 ఛానెల్ 135 జీఆర్పీలతో రెండవ స్ధానంలోకి పడిపోయింది. అలాగే సాక్షి కూడా నాలుగవ వారానికి పడిపోయింది. ఈటీవీ 2 ఐదవ స్ధానంలో ఉంది. స్టూడియో ఎన్ సైతం ఆరవ స్ధానానికి వచ్చింది. ఎన్ టీవీ ఇంతకు ముందు టాప్ ప్లేస్ లో ఉండేది. టామ్ సంస్ధ ఇచ్చిన రేటింగ్స్ ప్రకారం ఈ వారం...(జీఆర్పీలు) ఛానెల్... ఈ వారం... గత వారం
టీవి9 161 160
టీవి5 135 150
ఎన్ టీవి 95 97
సాక్షి 75 55
ఈటీవి2 69 74
స్టూడియో ఎన్ 66 88
10టీవి 61 62
ఐ న్యూస్ 37 34
జీ24 33 28
ఏబిఎన్ 30 30
గమనిక.... : ఈ రేటింగ్స్ కేవలం టామ్ సంస్ధ ఇచ్చిన సమాచారం (మీడియాలో ప్రచారంలో ఉన్న) మేరకు ... అలాగే ఈ రేటింగ్ లు వారం వారం మారిపోతూంటాయి.. వచ్చే వారానికి అంతా పూర్తిగా మారిపోవచ్చు కూడా.
You may also Like
Receive all updates via Facebook. Just Click the Like Button Below▼
▼