Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

విశాల్ పెళ్లి రాధిక శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీతో...





తమిళ నాట హీరోగా రాణిస్తున్న తెలుగు కుర్రాడు విశాల్ (విశాల్ రెడ్డి) త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచనలో వున్నట్టు కనిపిస్తున్నాడు. అమ్మాయిని కూడా ఇప్పటికే సెలెక్ట్ చేసేసుకున్నాడు. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు, కథానాయిక వరలక్ష్మిని మన హీరో పెళ్లి చేసుకోనున్నట్టు చెన్నయ్ సమాచారం.

గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నటి రాధిక (శరత్ కుమార్ భార్య) వీరి పెళ్ళికి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా, తన కాబోయే శ్రీమతి గురించి తాజాగా విశాల్ చిన్న హింట్ కూడా ఇచ్చాడు. తన కాబోయే భార్య సినిమా నటి అవ్వచ్చని పేర్కొన్నాడు.

దీనిని బట్టి వరలక్ష్మిని మనవాడు పెళ్లి చేసుకోవడం ఖాయమని అర్ధమవుతుంది. అది ఎప్పుడనేది మాత్రం మరో హీరో ఆర్యా పెళ్లిపై ఆధారపడివుంది. ఎందుకంటే, విశాల్, ఆర్యా మంచి స్నేహితులు. అసలు వీరి పెళ్ళిళ్ళు ఒకేరోజు, ఒకే వేదికపై, ఒకే సమయంలో చేయాలని వీరి కుటుంబాలు ఆలోచించాయట. అయితే, విశాల్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఆర్యా పెళ్లి జరిగిన మర్నాడు తాను చేసుకుంటానని చెబుతున్నాడు!

Recent Posts