Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

అన్నయ్య చిరంజీవిపై పవన్ కళ్యాణ్ సెటైర్


హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం అత్తారింటికి దారేది సినిమాలోని ఓ సంభాషణ పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. అన్నయ్య చిరంజీవిపై పవన్ కళ్యాణ్ సెటైర్లు విసిరే సంభాషణ కావడంతో దాని పట్ల అందరూ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. చిరంజీవితో పవన్ కళ్యాణ్ తీవ్రంగా విభేదిస్తున్న ప్రచారం సాగుతున్న తరుణంలో కూడా దానికి ప్రాధాన్యం పెరిగింది. సీనియర్ కమెడియన్ ఎంఎస్ నారాయణకు, హీరో పవన్ కళ్యాణ్కు మధ్య జరిగిన సంభాషణల్లో చిరంజీవిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారని భావిస్తున్నారు. చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాను టీవిల్లో చూసే దృశ్యం సినిమాలో ఉంది. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్కు, ఎంఎస్ నారాయణకు మధ్య ఓ సంభాషణ పెట్టారు





ఈయన ఎవరని పవన్ కళ్యాణ్ ఏమీ తెలియనట్లు అడుగుతాడు. చిరంజీవి అని... ఎంఎస్ నారాయణ చెప్పబోతాడు. అ సమయంలో యాక్టింగ్ బాగానే చేస్తున్నాడు, ఇప్పుడేం చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ అడుగుతాడు. మానేశారు సార్ అని ఎంఎస్ నారాయణ చెబుతాడు. ఎందుకని పవన్ కళ్యాణ్ అడుగుతాడు. వాళ్లబ్బాయ్ చేస్తున్నాడు అని ఎంఎస్ నారాయణ చెబుతాడు. చిరంజీవి యాక్టింగ్ మానేసిన విషయాన్ని వ్యంగ్యంగా సంభాషణల్లో పెట్టారు. రామ్ చరణ్ తేజాను ఓ సందర్భంలో చిరంజీవి తెగ పొగిడేశారు. దాన్ని అన్నయ్యపై పవన్ కళ్యాణ్ సెటైర్లు విసరడానికి పవన్ కళ్యాణ్ వాడుకున్నాడని అంటున్నారు. మొత్తం మీద, అన్నయ్యపై మునుపటి గౌరవభావంతో కాకుండా ఎవరాయన అని అడిగే పద్ధతిలో డైలాగ్స్ చెప్పడం వెనక పవన్ కళ్యాణ్ ఆంతర్యమేమిటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Recent Posts