Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

డబ్బుకోసం రంభ కొత్త అవస్థలు... చేతులు కాలిన తర్వాత కూడా...

రంభ గురించి, నటన గురించి, ఆమె అందం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి వరకు వెండితెరపై తన అందాలతో ప్రేక్షకలను మెప్పించిన రంభ ప్రస్తుతం మళ్లీ రీ ఎంట్రీతో పాటు, నిర్మాతగా మారి కొన్ని చిన్న చిన్న సినిమాలని కూడా నిర్మించాలనుకుంటుందట. అయితే నిర్మాతగా మారడం మాత్రం ఏ మాత్రం సేఫ్ కాదంటున్నారు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు!

ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించేందుకు సిద్ధమైన రంభ.. శింబు హీరోగా నటించనున్న చిత్రంలో ఆయనకు అక్కగా నటించనున్నారు. ఇది ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా దాదాపు ఖరారు అయినట్లే. ఇక సౌత్ బాషలలో వదిన పాత్రలైనా మంచి పాత్రలు దొరికితే తప్పక చేస్తానని చెబుతుంది. ఇంతవరకు బాగానే ఉన్న నిర్మాతగా కూడా మారలనికోవడమే సన్నిహితులకు మింగుడు పడడంలేదట.

రంభ గతంలో కూడా ఓ సారి నిర్మాతగా మారి చేతులు కాల్చుకుంది. మళ్ళీ ఇప్పుడు సినిమాలు నిర్మించాలనే ఆలోచన రంభకి ఎందుకొచ్చిందోగానీ మళ్లీ నిర్మాతగా మారలనుకుంటుంది. మంచిది కాదని సన్నిహితులు ఎంత వారించినా కానీ రంభ మాత్రం తాను లో బడ్జెట్‌ సినిమాల గురించే ఆలోచిస్తున్నాను కాబట్టి, తాను చేయబోయే పని రిస్క్‌తో కూడుకున్నది కాదంటోంది. చూద్దాం రంభ నిర్మాతగా ఎంత లాభం గడిస్తుందో...

Recent Posts