Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

నా భార్యలో శృంగార కోర్కెలు పెంచడమెలా?





ప్రశ్న :

నా పేరు కోటేశ్వర రావు. వయస్సు 40 యేళ్లు. నా భార్యకు 34 సంవత్సరాలు. మాకు పెళ్ళయి ఆరేళ్లవుతోంది. మాకు ఒక బాబు ఉన్నాడు. పెళ్ళయిన 4 సంవత్సరాల నుంచి శృంగార జీవితం గడిపాం. కానీ గత రెండేళ్లుగా నా భార్య సెక్స్‌లో ఆసక్తి చూపడం లేదు. నాకు కోర్కెలు ఎక్కువగా కలుగుతున్నాయి. రోజూ రెండు సార్లయినా శృంగారంలో పాల్గొనాలని ఉంది. కానీ, ఆమె అలసిపోయి వద్దంటోంది. తన ప్రవర్తన నాలో చిరాకుని, విసుగుని కలిగిస్తోంది. ఆమెలో సెక్స్ కోరికలు పెంచే మందులేవైనా ఉన్నాయా? భార్యను నా దారికి తెచ్చుకునేదెలా? సలహా ఇవ్వరు ప్లీజ్.




సమాధానం :

సెక్స్‌లో ఇష్టాయిష్టాలు స్త్రీ పురుషులకు వేర్వేరుగా ఉంటాయి. మీకు సెక్స్ కోరికలు అధికంగా ఉంటే మీ భార్యకు లేనట్టుగా తెలుస్తోంది. అలాంటి మహిళ నుంచి మీరు సెక్స్‌ని ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. వివాహమైన 4 యేళ్ల తర్వాత కూడా స్త్రీలు రోజుకు రెండుసార్లు సెక్సంటే ఆసక్తిని చూపుతారు. కానీ, ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది. అంటే మీ భార్యతో బలవంతపు శృంగారం చేయిస్తున్నట్టుగా ఉన్నారు. ఆ హక్కు మీకు లేదు.




శృంగారంలో పరస్పర ఆమోదం ఉండాలి. అప్పుడే ఇద్దరికీ ఆనందంగా ఉంటుంది. దంపతుల మధ్య ఒక్క సెక్స్ మాత్రమే ఉండాలా? సెక్సే జీవితం కాదు. పైగా భార్య మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ కోరిక తీర్చే లైంగిక వస్తువు, యంత్రం కాదు. బలవంతపు శృంగారం ఇద్దరిలో ఘర్షణను కలిగించి దూరాన్ని పెంచుతుంది. ఆమె కోణంలోంచి ఆలోచించండి. ఆమెతో మాట్లాడండి. ఇద్దరికీ అంగీకార యోగ్యంగా ఉంటేటట్లు శృంగారానికి రోజులో ఓ సమయం కేటాయించండి. మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

Recent Posts