Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

AD: ఓవర్సీస్ లో పవన్ కళ్యాణ్ ఎవరికీ అందడేమో?

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం రికార్డు కలెక్షన్లతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. రూ. 100 కోట్ల దిశగా దూసుకెలుతున్న ఈచిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ మార్కెట్ రేంజి ఏమిటో నిరూపిస్తోంది. రాముడు చెబితే తప్ప హనుమంతుని శక్తి ఏమిటో బయట పడలేదు అనే చందంగా.....పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది' సినిమా వచ్చే దాకా తెలుగు సినిమా మార్కెట్ పరిధి రేంజి ఇంత స్థాయిలో ఉందనేది తెలియలేదు అని అంటున్నారు అభిమానులు. తాజాగా అత్తారింటికి దారేది చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో సరికొత్త బెంచ్ మార్కును అందుకుంది. ఈచిత్రం ఓవర్స్ వసూళ్లలో రూ. 20 కోట్లను అధిగమించింది. ఒక్క అమెరికాలోనే ఈచిత్రం రూ. 14 కోట్లుకు పైగా వసూలు చేసింది. యూకె. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, సింగపూర్ లాంటి దేశాల్లో మొత్తం కలిపి రూ. 6 కోట్లకు పైగా రాబట్టింది.

తాజాగా అత్తారింటికి దారేది చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో సరికొత్త బెంచ్ మార్కును అందుకుంది. ఈచిత్రం ఓవర్స్ వసూళ్లలో రూ. 20 కోట్లను అధిగమించింది. ఒక్క అమెరికాలోనే ఈచిత్రం రూ. 14 కోట్లుకు పైగా వసూలు చేసింది. యూకె. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, సింగపూర్ లాంటి దేశాల్లో మొత్తం కలిపి రూ. 6 కోట్లకు పైగా రాబట్టింది.

ఈచిత్రాన్ని ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ‘మైత్రి' మూవీస్ సంస్థ వసూళ్ల విషయాలను అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ సినిమా వసూళ్లతో టాలీవుడ్ నిర్మాతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఒక మంచి సినిమా తీస్తే 100 కోట్లను అందుకోవచ్చే విషయం రుజువవుతోంది. కాగా...సినిమాలో కొన్ని అదనపు సీన్లు కలుపుతున్నట్లు ఇటీవల వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ వియాషన్ని ప్రొడక్షన్ టీం అఫీషియల్‌గా ప్రకటించింది. అదనంగా 6 నిమిషాల నిడివిగల సీన్లు కలుపుతున్నట్లు వెల్లడించారు. అభిమానులకు దీపావళి కానుకగా ఈ సీన్ కలిపినట్లు చెబుతున్న నిర్మాతలు.....అక్టోబర్ 31 నుంచి సినిమాలో ఆ అదనపు సీన్లు కనిపిస్తాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్‘అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.

Recent Posts