Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

లగడపాటి – సాక్షి జర్నలిస్టుల సంవాదం

విజయవాడ లో నిన్న లగడపాటి – సాక్షి జర్నలిస్టుల సంవాదం పత్రికా స్వాంతంత్ర్యం మీద దాడి అని సాక్షి అంటూ వుండగా, జర్నలిస్టులు తమ పరిధి మీరి ప్రవర్తించారని లగడపాటి వర్గం ఆరోపిస్తోంది. జరిగింది అందరూ టీ వీ లలో చూశారు. లగడపాటి అన్న మాటలూ విన్నారు. సదరు విలేఖరుల పట్ల లగడపాటి ఉపయోగించిన బాషని నూరు శాతం తప్పు పడుతూనే, సాక్షి పత్రిక విలేఖరుల తీరుని కూడా తప్పు పట్టాల్సి వుంటుందేమో. ఎవరిది తప్పు అని తేల్చడానికి సంసిద్దమయ్యే ముందు కొంత కాలం వెనక్కి వెళ్ళి అప్పటి నించి మారిన పరిస్థితులను చూడాలేమో!

ఎందుకంటే ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకొనే మీడియా ఒకప్పుడు నీతి నిజాయితీలను పాటిస్తూ మచ్చ లేకుండా వుండేది. అంతెందుకు గత ఏడెనిమిది సంవత్సరాల ముందు దాకా కూడా మీడియా తన ప్రాధాన్యతను నిలబెట్టుకొంటూ వచ్చింది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మీడియా తన నైతిక విలువలను కొంత వరకు కోల్పోయింది అన్నది సత్యం. అన్నీ పత్రికల విషయంలో కాకపోయినా, రాజకీయ నాయకులు, చేత, కొరకు, కోసం ఏర్పరచబడ్డ సాక్షి లాంటి పత్రికలు, చానెళ్లు, తమకిష్టం వచ్చినట్లు రాస్తూ, కేవలం రాజకీయ ప్రత్యర్డుల మీదకి బురద చల్లడమనే ఏకైక లక్ష్యంతో పని చేస్తూ వస్తున్నాయి.

సాక్షి తో పాటుగా ఇంకొన్ని ఇతర పార్టీలు కూడా తమకంటూ పత్రికలు పెట్టుకోవటంతో , కేవలం ఆ పార్టీల కోసమే పని చేస్తూ వస్తున్నాయి. అందువలన ఆయా పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులు కూడా వాళ్ళ నాయకుల విధానం ప్రకారం, రాజకీయంగా తమ పార్టీకి , పత్రికకూ వ్యతిరేకంగా వున్న వాళ్ళను, తమ పత్రికల్లోనే కాదు, పత్రికా సమావేశాల్లో కూడా ఇబ్బంది పెడుతూ వస్తున్నారు.

జర్నలిస్టులు వుండేది ప్రశ్నలు వెయ్యడానికే. కానీ ఆ పత్రికా సమావేశంలో మాట్లాడే సదరు నాయకుడు తమ పత్రిక అధినేత కూడా అయిన ఒక రాజకీయ నాయకుడిని తిడుతూ వుంటే అక్కడే రాసుకొనే ఆ విలేఖరులు తట్టుకోలేకపోతున్నారు. రాజకీయాలన్న తర్వాత పార్టీలు ఒకరినొకరు తప్పు పట్టడం సహజం. ప్రజాస్వామ్యంలో తీరే అది. దాన్ని తప్పు పట్టలేము. కానీ తమ నాయకుడిని తిట్టారు కాబట్టి తాము ఆ పత్రికా సమావేశం లోనే రియాక్ట్ కావాలి అనుకోవడం సదరు విలేఖరుల తప్పు. జర్నలిస్టులు వుండేది సమాజంలో రోజూ జరిగే వార్తలు అందివ్వడానికి. ఇంకా చెప్పాలంటే పార్టీ ఆఫీసుల్లో బీట్ డ్యూటీ లో వుండే విలేఖరులు కూడా ఆయా పార్టీ ల్లో జరిగే విషయాలు రాయడానికే. కానీ ఈ విలేఖరులు తమ యజమాని అయిన, తమ పార్టీ నాయకుడిని ప్రత్యర్ధి రాజాకీయ పార్టీ నాయకుడు తప్పు పడుతూ వుంటే అంతగా రియాక్టు కావడం రాజకీయాలు – మీడియా కలిసిపోయినందువలన వచ్చిన దౌర్భాగ్యం.

కొన్నాళ్ళ క్రితం తెలుగు దేశం పార్టీ, తమ కార్యాలయానికి గానీ, తమ పత్రికా సమావేశాలకు గానీ , సాక్షి మరియు నమస్తే తెలంగాణ పత్రిక ప్రతినిధులు రానవసరం లేదు అని ఖచ్చితంగా చెప్పేసాయి అంటే, ఆయా పత్రియకల వలన ఆ పార్టీ ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటోంది అన్నది చూడాలేమో. పత్రిక పెట్టాము కాబట్టి తమకిష్టం లేని వాళ్లందరినీ తిడుతాము అంటే, ఇంకా పత్రికా విలువలు వలువలు వూడదీసుకొని గంగాలో దూకినట్టే. కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడే లగడపాటి ఖచ్చితంగా తన ప్రత్యర్ది అని ఆయన జగన్ ను ఒక వేల భావిస్తే తప్పు పడతారు. దానికి సాక్షి పత్రిక విలేఖరులు బాధపడితే ఎలా? ఆ విలేఖరుల పని అక్కడ చెప్పింది వార్తాగా రాసి ఇవ్వడం. అదనపు సమాచారం కోసం ప్రశ్నలు వెయ్యడం. వాళ్ళే గొడవ పెట్టుకొంటే ఎలా?

ఇక లగడపాటి భాష..!! ప్రజా జీవితం లో వుండే వారు గౌరవంగా వుండాలి. వుండడమే కాదు ప్రజలకు అలా కనిపించాలి కూడా. గత కాలపు నాయకులు అంటే, చంద్ర బాబు నాయుడు, ఆయన తరం వారు, ఇంకా చెప్పాలంటే వై యెస్ కూడా, ఒక్క సారి అసెంబ్లీ లో చంద్ర బాబు పట్ల కనబరచిన అగౌరవం తప్ప, ఎప్పుడు ప్రత్యర్ధులని అగౌరవంగా బజారు బూతులతో మాట్లాడిన సందర్భం లేవనే చెప్పాలి.

అవతలి వ్యక్తి విలేఖరా, మామూలు మనీషా అన్నది కాదు ప్రశ్న. ప్రతి వ్యక్తిని గౌరవంగా సంబోధించాలి అనే విషయం లగడపాటి మరచి పోయారేమో మరి !!

Recent Posts